Bigg Boss Telugu 6: బిగ్ బాస్ షోలో పాపులర్ సింగర్.. ఇదిగో ప్రూఫ్!

ఆదివారం(సెప్టెంబర్ 4) నాడు సాయంత్రం నుంచి బిగ్ బాస్ సీజన్ 6 మొదలుకానుంది. ఓటీటీ వెర్షన్ మాదిరి సీజన్ 6ని కూడా 24 గంటల పాటు లైవ్ ప్రసారం చేయబోతున్నారని తెలుస్తోంది. ఎప్పటిలానే ఈ సీజన్ ని కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న కంటెస్టెంట్స్ ను హోటల్ రూమ్ లో క్వారెంటైన్ లో పెట్టారు. గత ఐదు రోజులుగా వారు హోటల్ రూమ్స్ లోనే ఉంటున్నారు.

దీంతో కొందరు కంటెస్టెంట్స్ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లుగా పోస్ట్ లు పెడుతున్నారు. యూట్యూబర్ ఆదిరెడ్డి ఇన్స్టాగ్రామ్ లో లైవ్ పెట్టారు. సింగర్ రేవంత్ కూడా తాను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు చెప్పారు. అంతేకాదు.. టైటిల్ తో బయటకొస్తానని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. ”లైఫ్ లో కొన్ని త్యాగం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నా భార్యను, నాకిష్టమైన సంగీతాన్ని కూడా మిస్ అవుతున్నాను.

కానీ ఒక భగీరధుడి సాధనాల గెలిచి మంచి పేరుతో బయటకొస్తాను. మీ ఓట్లతో నన్ను గెలిపించండి. ఎంటర్టైన్మెంట్ కి అంతా రెడీ అయింది. మీ సపోర్ట్ తో టైటిల్ గెలిచి వస్తాను” అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ పెట్టారు రేవంత్. అలా తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నట్లు ముందే లీక్ ఇచ్చారు.

ఇదివరకు బిగ్ బాస్ షోకి వెళ్లే కంటెస్టెంట్స్.. షో టెలికాస్ట్ కాకముందు ఇలా పోస్ట్ లు పెట్టేవారు కాదు. ఒకవేళ పెట్టినా.. హింట్ ఇచ్చి వదిలేసేవారు. కానీ ఈసారి మాత్రం చాలా మంది డైరెక్ట్ గా పోస్ట్ లు పెట్టేస్తున్నారు. అలా కూడా బజ్ వస్తుందని బిగ్ బాస్ టీమ్ లైట్ తీసుకున్నట్లుంది. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో కనిపించనున్నారు. దాదాపు వంద రోజుల పాటు షోని నడిపించబోతున్నారు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus