ఎస్పీ శైలజ అందరికీ సుపరిచితమే. దివంగత లెజెండరీ సింగర్ అయిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి ఈమె స్వయానా చెల్లెలు. దాదాపు 40 ఏళ్లుగా ఈమె సినిమాల్లో పాటలు పాడుతూ శ్రోతలను అలరిస్తుంది. అలాగే డబ్బింగ్ చెప్పడంలో కూడా స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది అని చెప్పాలి. ఇటీవల ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. నిజానికి ఈమె సింగర్ అవుతుంది అని అస్సలు అనుకోలేదట. ఒక పాట పాడి ఊరుకుంటానేమో అని అనుకుందట.
ఈమె కుటుంబంలో బాల సుబ్రహ్మణ్యం గారు తప్ప మిగిలిన వారంతా సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉంటారని,ఈమె స్టేజి పై పాటలు పాడటం తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు అని తెలిపింది. తర్వాత అంగీకరించారు అని తెలిపింది. ఇక ఈమె ఓ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శైలజ ఆ రోజులను మరోసారి గుర్తు చేసుకున్నారు. ఎస్పీ శైలజ మాట్లాడుతూ… “కె.విశ్వనాథ్ గారు నాకు ఓ దర్శకుడిగా కంటే కూడా ఓ అన్నయ్యగా నాకు వారితో అనుబంధం ఉంది.
నన్ను కూడా సొంత చెల్లిలా భావించి ఆయన ఎన్నో విషయాలు పంచుకునేవారు. అందుకే ఆయన డైరెక్ట్ చేసిన ‘సాగర సంగమం’ సినిమాలో నేను నటించాను. నేను నటించిన ఏకైక సినిమా అది. ఆ సినిమాలో ఓ సన్నివేశం ఉంటుంది. కమల్ హాసన్ గారిని కాలుతో తన్నే సీన్ అది. ఆ సీన్ చేయడానికి నేను ఎంతో కష్టపడ్డాను.
నేను ఎంత ప్రయత్నించినా ఎందుకో నా కాలు వెనక్కి వచ్చేసేది. అది చూసి విశ్వనాథ్ గారు ఇది కేవలం పాత్ర తీరు మాత్రమే అని వివరంగా చెప్పారు. దీంతో ఏదో ఒకరకంగా ఆ సీన్ చేసేశాను” అంటూ చెప్పుకొచ్చింది.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!