Singham Again Trailer: రామాయణాన్ని ఇలా కూడా తీయొచ్చా? వసూళ్లు అదిరిపోతాయ్‌ అంటూ..!

రోహిత్‌ శెట్టి (Rohit Shetty) సినిమాలు చూస్తున్నంతసేపు ఎక్కడి లేని హై వచ్చేస్తుంటుంది మనకు. ఏమన్నా సీనా ఇది అని ముచ్చటపడిపోతారు. అయితే ఏదో మూలకు ఈ సీన్‌ తెలుగు సినిమాలో ఎక్కడో చూశాను అని కూడా అనిపిస్తుంటుంది. మరోసారి ఇదేంటి ఇదెలా సాధ్యం అని కూడా అనుకుంటారు. ఈ రెండు లాజిక్‌లు వదిలేస్తే రోహిత్‌ సినిమాలు చాలా డిఫరెంట్‌. అందుకే ఆయన మాస్‌ సినిమాలకు ఫ్యాన్‌బేస్‌ భారీగా ఉంటుంది. అందులోనూ పోలీసు సినిమాలకు.

Singham Again Trailer

తాజాగా ఆయన తెరకెక్కించిన పోలీసు సినిమా ‘సింగమ్‌ అగైన్‌’ (Singham Again) . నిజానికి తమిళ సినిమా ‘సింగమ్‌’ రీమేక్‌గా మొదలైన హిందీ ‘సింగమ్‌’ ఫ్రాంచైజీ.. తమిళంలో ఆగిపోయినా అక్కడ కొనసాగుతోంది. ఈ క్రమంలో ‘సింగమ్‌ అగైన్‌’ అంటూ మూడో సినిమా వచ్చేస్తోంది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఏ సినిమాకూ లేనంతగా ఐదు నిమిషాలకుపైగా ట్రైలర్‌ను కట్‌ చేశారు. సగం బాలీవుడ్‌ స్టార్లు ఇందులో కనిపించారు కూడా. రోహిత్ శెట్టి తన ‘కాప్ యూనివర్స్’లో ‘సింగమ్‌’ (Singham) సినిమాలు, ‘సూర్యవంశీ’, ‘సింబా’ సినిమాలు చేసి అలరించారు.

ఇప్పుడు తన సినిమాల పాత్రలన్నిటినీ ఒక చోటకి చేర్చి ‘సింగం అగైన్’ తెరకెక్కించారు. దీపావళి కానుకగా నవంబరు 1న ‘సింగం అగైన్’ థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌ చేసి ట్రైలర్‌ అదిరిపోయింద. పురాణ గాథ రామాయణం ఆధారంగా ‘సింగం అగైన్’ తెరకెక్కింది. రామాయణం పాత్రలను ప్రతిబింబించేలా అజయ్‌ దేవగణ్‌ను (Ajay Devgn) రాముడిగా, సీతగా కరీనా కపూర్‌ను (Kareena Kapoor) చెప్పారు. లక్ష్మణుడిగా టైగర్ ష్రాఫ్ (Tiger Shroff), ఆంజనేయుడిగా రణ్‌వీర్ సింగ్‌ (Ranveer Singh) కనిపిస్తారు. జటాయువుగా అక్షయ్ కుమార్‌ (Akshay Kumar) నటించాడు.

దీపికా పడుకొణె (Deepika Padukone) పాత్ర స్పెషల్‌. ఇక రావణుడి పాత్రలో అర్జున్ కపూర్‌ (Arjun Kapoor) కనిపించాడు. ఎందుకో కానీ ఈ పాత్రను అత్యంత క్రూరంగా చూపించారు రోహిత్‌ శెట్టి. అన్నట్లు ఈ సినిమా మీద బాలీవుడ్‌ భారీ ఆశలు పెట్టుకుంది. స్టార్‌ హీరోలకు ఈ ఏడాది సరైన విజయం దక్కడం లేదు. మరి ‘సింగమ్‌ అగైన్‌’.. బాలీవుడ్‌ షైన్‌ అగైన్‌ అనిపిస్తుందేమో చూడాలి.

ఇంటర్వ్యూ : ‘జనక అయితే గనక’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి బండ్ల.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus