Bigg Boss 5 Telugu: సిరిని ప్రేమించిన అబ్బాయి ఎలా చనిపోయాడో తెలుసా..?

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ వాళ్లు ప్రేమించిన వాళ్ల గురించి చెప్పడం అనేది ఎప్పుడూ జరిగేదే. అన్ని సీజన్స్ లో కూడా వాళ్ల మొదటి ప్రేమ తాలుకూ మెమరీస్ ని షేర్ చేసుకుంటారు. ఇందులో భాగంగానే సిరి తన తొలిప్రేమ గురించి చెప్పింది. సిరిమాటల్లోనే ఆమె లవ్ స్టోరీని వింటే.., ” అతని పేరు విష్ణు అందరూ చిన్న అంటారు. నేను కూడా అలాగే రాస్తాను అంటూ బెలూన్ పై అతని పేరు రాసింది. అప్పుడు నేను 10వ తరగతి చదువుతున్నాను. ఇంటి ఎదురుగా ఉండే అబ్బాయి. ఒకరోజు నాకు ప్రపోజ్ చేశాడు. నేను కూడా తను ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తాడా అనే చూస్తున్నాను.

తను చాలా పొసేసివ్. వేరే అబ్బాయిలతో మాట్లాడితే అస్సలు సహించేవాడు కాదు. కాలేజ్ లో అబ్బాయిలతో మాట్లాడినా కూడా ఊరుకునేవాడు కాదు. దీంతో మా ఇద్దరిమద్యలో గొడవ వచ్చింది. అదే టైమ్ లో నాకు ఇంట్లో ఒక సంబంధం చూశారు. అతని మీద కోపంతో సంబంధాన్ని ఒప్పేసుకున్నాను. రేపు ఎంగేజ్మెంట్ అనగా వచ్చి నా దగ్గర ఏడ్చాడు. నా కాళ్లమీద పడ్డాడు. నువ్వు లేకుండా నేను ఉండలేను అని, నువ్వు కావాలి అని, నాదే తప్పు అని ప్రాధేయపడ్డాడు. నాకు అతనంటే ఇష్టం. అందుకే, ఆ ప్రెషర్ భరించలేక ఇంట్లో నుంచీ ఆ తెల్లవారుఝూమునే పారిపోయాం.

ఆ ప్రెషర్ తీస్కోలేక వెళ్లిపోయినపుడు మా అమ్మ మళ్లీ నన్ను బ్రతిమిలాడి ఇంటికి తీస్కుని వచ్చింది. మళ్లీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని నెలలు మేము రిలేషన్ షిప్ లో ఉన్నాము. అంతా బాగానే నడుస్తోంది అనుకున్నప్పుడు మళ్లీ మా మద్యలో కొన్ని గొడవలు స్టార్ట్ అయ్యాయి. సడన్ గా ఒకరోజు మార్నింగ్ 3 – 4 గంటల ప్రాంతంలో మెలకువ వచ్చింది. ఏదోలే అనుకుని మళ్లీ పడుకుని నార్మల్ గా నిద్రలేవగానే., తను చనిపోయాడు అని న్యూస్ వినిపించింది. అంటూ ఏడ్చేసింది సిరి.

నేను తనకోసం ఇంతచేశాను, కానీ ఆదేవుడు నాకు అతడ్ని ఇవ్వలేదు. అతను చనిపోయాడు అని తెలిశాక చాలా బాధపడ్డాను. నేను ఎప్పుడైతే ఎర్లీమార్నింగ్ లేచానో అదే టైమ్ కి యాక్సిడెంట్ అయి చనిపోయాడని తెలిసి ఇంకా బాధపడ్డాను. అంటూ ఏడుస్తూ బెలూన్ ని వదలలేకపోయింది. దీంతో అక్కడ ప్రియాంక వచ్చి సిరికి ధైర్యం చెప్పింది. ఐ లవ్ యూ అంటూ బెలూన్ ని గాల్లోకి వదిలింది సిరి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus