సిరి, శ్రీరామ్ ల పరిస్థితి ఇంత దారుణమా..?

బిగ్ బాస్ సీజన్ 5 ముగిసిపోయింది. దాదాపు 106 రోజుల పాటు ఈ షో కొనసాగింది. సన్నీ విన్నర్ గా నిలవగా.. షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. ఇక ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లకు సినిమా అవకాశాలు వస్తుండడంతో అందరూ ఖుషీ అవుతున్నాయి. పాపులారిటీతో పాటు ఆఫర్లు కూడా రావడం మంచి విషయమనే చెప్పాలి. ముఖ్యంగా టాప్ 5 కంటెస్టెంట్స్ లు ఇంటర్వ్యూలతో బాగా బిజీ అయ్యారు. ఈ క్రమంలో శ్రీరామచంద్ర, సిరి పాదాలను చూసి అభిమానులు షాకవుతున్నారు.

పాదాలపై ఉండే చర్మం ఓడిపోవడంతో కాళ్లు బాగా ఎర్రగా అయిపోయాయి. హౌస్ లో అంత నొప్పిని భరించి గేమ్ ఆడినందుకు వాళ్లను ప్రశంసిస్తున్నారు నెటిజన్లు. టికెట్ టు ఫినాలే టాస్క్ లో భాగంగా ఇచ్చిన ఐస్ టాస్క్ కారణంగానే సిరి, శ్రీరామ్ లకు ఈ పరిస్థితి వచ్చింది. ఎక్కువసేపు ఐస్ వాటర్ లో ఉండడం వలన సిరి కాళ్లు సెన్సిటివ్ అయిపోయి నడవలేని పరిస్థితికి చేరుకుంది. ప్రియాంక తనకొచ్చిన వైద్యంతో శ్రీరామ్ పాదాలకు వేడినీళ్లు పోసి బామ్ రాసింది.

దీంతో అతడు మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి కలిగింది. అయితే బిగ్ బాస్ మాత్రం వారి పాదాలను ఎక్కడా చూపించకుండా జాగ్రత్త పడ్డాడు. కేవలం నడవలేకపోతున్నారనేది మాత్రమే చూపించాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు బిగ్ బాస్ టీమ్ పై మండిపడుతున్నారు. శ్రీరామ్, సిరి పాదాలకు బొబ్బలు వచ్చి చర్మ ఊడిపోయిన విషయాన్ని ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టాస్క్ ల పేరుతో కంటెస్టెంట్లను ఇంతగా టార్చర్ చేస్తారా…? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ దెబ్బలతోనే శ్రీరామ్, సిరి గేమ్ ఆడినట్లు చూపించి ఉంటే సింపతీ ఓట్లు పెరిగేవంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

పుష్ప: ది రైజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!

Share.