ప్రభుత్వ లాంఛనాలతో సిరివెన్నెల అంత్యక్రియలు!

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. లంగ్ క్యాన్సర్ తో పోరాడుతూ.. తుదిశ్వాస విడిచారు సిరివెన్నెల. ఆయన పార్థివ దేహానికి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. సిరివెన్నెల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సిరివెన్నెల అరుదైన గౌరవాన్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. సీతారామశాస్త్రి వైద్య ఖర్చులను తామే భరిస్తామని.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

అంతేకాదు.. ప్రభుత్వ లాంఛనాలతో సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహిస్తామని తలసాని తెలిపారు. మరోవైపు.. ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల పార్థివ దేహాన్ని చివరిసారిగా సందర్శించేందుకు పలువురు సినీ ప్రముఖులతో పాటు.. సిరివెన్నెల అభిమానులు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు హిందూ సాంప్రదాయ పద్దతిలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ​మధ్యాహ్నం సిరివెన్నెల అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంతిమయాత్రలో పలువురు సినీ ప్రముఖులు, వేలాదిమంది అభిమానులు పాల్గొననున్నారు

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus