‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి పాటలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఏపీలోని విశాఖ జిల్లా దోసూరు గ్రామంలో జన్మించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి 1973 సంవత్సరంలో ఎంబీబీఎస్ లో చేరారు. క్లాస్ లో ఎప్పుడూ మొదటి బెంచ్ లో కూర్చునే సీతారామశాస్త్రికి ఎంబీబీఎస్ చదివే సమయంలో మాత్రం చివరి బెంచ్ దొరికింది. ఇంగ్లీష్ లో ప్రావీణ్యత లేకపోవడం వల్ల సిరివెన్నెల సీతారామశాస్త్రికి లెక్చరర్స్ చెప్పే పాఠాలు అర్థం అయ్యేవి కావు. ఆ సమయంలో బ్లాక్ బోర్డ్ సరిగ్గా కనిపించకపోవడం వల్ల కూడా సిరివెన్నెల ఇబ్బంది పడటం గమనార్హం.
ఆ సమయంలో సిరివెన్నెలకు తనకు కంటి సమస్య ఉందని అర్థమైంది. అదే సమయంలో ఉమ్మడి కుటుంబ పోషణ విషయంలో తండ్రి ఇబ్బంది పడుతున్నాడని సిరివెన్నెల గుర్తించారు. ఆ తర్వాత ఎంబీబీఎస్ కు ఫుల్ స్టాప్ చెప్పిన సిరివెన్నెల టెలిఫోన్ శాఖలో పనిచేశారు. ఆ సమయంలో సిరివెన్నెల వేతనం కేవలం 300 రూపాయలు కావడం గమనార్హం. ఆ తర్వాత తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఓపెన్ యూనివర్సిటీలో సిరివెన్నెల బీఏ చేశారు.
ఆ తర్వాత సిరివెన్నెల తండ్రి మరణించగా కుటుంబ పోషణ భారం ఆయనపై పడింది. తర్వాత రోజుల్లో సిరివెన్నెలకు ప్రముఖ సాహితీవేత్తలతో పరిచయం ఏర్పడింది. 1986 సంవత్సరంలో సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల సీతారామశాస్త్రి కెరీర్ మొదలైంది. సిరివెన్నెల పాటలలో మెజారిటీ పాటలు హిట్టయ్యాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలోని దోస్తీ పాటను రాసిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కావడం గమనార్హం. శ్యామ్ సింగరాయ్ సినిమాలో కూడా సిరివెన్నెల రెండు పాటలు రాశారు.
Most Recommended Video
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?