దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ రాకూర్ హీరోయిన్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతి మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.స్టార్ హీరోయిన్ రష్మిక మందన,దర్శకుడు తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్,భూమిక వంటి వారు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది.
ఇక ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడంతో… మంచి కలెక్షన్లు నమోదు చేసింది.మొదటి వారమే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసిన ఈ మూవీ 11 వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసింది. ఒకసారి 11 రోజుల కలెక్షన్లు గమనిస్తే :
నైజాం
5.98 cr
సీడెడ్
1.45 cr
ఉత్తరాంధ్ర
2.36 cr
ఈస్ట్
1.31 cr
వెస్ట్
0.92 cr
గుంటూరు
1.11 cr
కృష్ణా
1.25 cr
నెల్లూరు
0.60 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
14.98 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.66 cr
ఓవర్సీస్
5.40 cr
మిగిలిన వెర్షన్లు
4.70 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
26.74 cr
‘సీతా రామం’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.16.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.17 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.11 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.26.74 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది.
ఓవరాల్ గా ఈ మూవీ రూ.9.74 కోట్ల లాభాలను అందించింది. రెండో వీకెండ్ హాలిడేస్ రావడంతో ఈ మూవీ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసింది.