దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సీతా రామం’. ‘వైజయంతీ మూవీస్’ సమర్పణలో ‘స్వప్న సినిమా’ పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం రేపు అనగా ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు.టీజర్, ట్రైలర్, పాటలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ప్రమోషనల్ కంటెంట్ అంతా సినిమాపై పాజిటివ్ వైబ్స్ ను క్రియేట్ చేసింది.
కాబట్టి సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆల్రెడీ సినిమా చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందట.. దుల్కర్ నటన.. పాటలు, సంభాషణలు చాలా బాగున్నాయట. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని.. చెబుతున్నారు. సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా సాగినప్పటికీ ప్రేమకథా చిత్రాల్లో ఇది కామన్ అని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు.
పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుందని, నిర్మాణ విలువలకు అశ్వినీదత్ గారు ఎక్కడా తగ్గలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా అయితే ఓ మంచి ప్రేమకథా చిత్రాన్ని చూసిన ఫీలింగ్ ను ‘సీతా రామం’ కలిగిస్తుందని, మాస్ ప్రేక్షకులు మాత్రం ఈ మూవీకి తొందరగా కనెక్ట్ అవ్వకపోవచ్చు అని వారు చెబుతున్నారు. మరి మార్నింగ్ షోలు ముగిశాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
Just completed watching @hanurpudi magic #SitaRamam Enti anna edipincheysav..kotteysav anna blockbuster @VyjayanthiFilms me banner lo Enko epic classic tisaru many years this movie will remain in peoples heart.Thanks for movie
— Venkata Reddy Guduru (@venkatareddyuni) August 5, 2022