బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ రెండో రోజు కూడా టెలికాస్ట్ చేశాడు బిగ్ బాస్. అయితే, ఈ నామినేషన్స్ లో అమర్ కి ప్రియాంకకి పెద్ద యుద్ధమే జరిగింది. ఆ తర్వాత ప్రియాంక ఫైనల్ గా శివాజీని నామినేట్ చేస్తూ ఆర్గ్యూమెంట్ కి దిగింది. నీతో ఆర్గ్యూమెంట్ చేసే ఓపిక నాకు లేదంటూ శివాజీ రెచ్చిపోయాడు. శివాజీని నామినేట్ చేస్తూ ప్రియాంక లాజిక్ పాయింట్ వర్కౌట్ చేసింది. సంచాలకులుగా ఇద్దరు ఉన్నప్పుడు ప్రశాంత్ ని ఎందుకు నామినేట్ చేశావ్ ? శోభాని ఎందుకు చేయలేదని మీరు గౌతమ్ ని అడిగారు కదా,
మరి నలుగురు రాజమాతలు ఉన్నప్పుడు గతవారం నన్నే మీరెందుకు నామినేట్ చేశారని నిలదీసింది. దీనికి మీకు తెలీదా.. అసలు చాలా సిల్లీ పాయింట్ కి నన్ను నామినేట్ చేశారు. అక్కడ గౌతమ్ చెప్పింది వాలిడ్ పాయింటే కాదు. వీడియో చూపించారని చేశారంటూ శివాజీ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. దీంతో ఇద్దరి మద్యలో వాదన పెరిగింది. నీతో అసలు వాదించాలని కూడా నాకు లేదంటూ దబాయించాడు శివాజీ. చెప్పండి మీరు పాయింట్స్ చెప్పకపోతే నేనెలా మాట్లాడతాను అంటే, ఫస్ట్ నుంచీ కూడా మీరు ఇంతే అస్సలు చెప్పింది వినట్లేదు అంటూ మాట్లాడాడు.
ఏవిషయంలో వినలేదు ? క్లారిటీగా పాయింట్ టు పాయింట్ చెప్పండంటూ నిలదీసింది ప్రియాంక. అమ్మా, నీ కలర్స్ చూపించకు అంటూ శివాజీ మరో మాట అన్నాడు. దీనికి బాగా హర్ట్ అయిన ప్రియాంక ఎలాంటి కలర్స్ చూపించాను.. రండి ఆన్సర్ చేయండంటూ వాదనకి దిగింది. అస్సలు నీతో వాదించి డిపెండ్ చేస్కోవాలని లేదని శివాజీ తెగేసి మరీ చెప్పాడు. నీ నామినేషన్ యాక్సెప్ట్ చేశాను కదా ఇంకే కావాలంటూ ముగించాడు. నామినేషన్స్ తర్వాత కూడా ప్రియాంక శివాజీ దగ్గరకి వచ్చి మేమేం చేశామో చెప్పండి.
దాన్ని బట్టీ మార్చుకుంటాం కదా., మీరు ఒక్కళ్లకే హౌస్ లో సపోర్ట్ చేస్తుంటే ఎలా అంటూ మాట్లాడింది. అయినా కూడా శివాజీ చెప్పే మూడ్ లో లేడు. ప్రియాంకకి ఆన్సర్ చెప్పలేదు. ఆ తర్వాత యావర్ – ప్రశాంత్ తో మాట్లాడుతూ నాకు ప్రియాంకతో డిబేట్ చేయాలని లేదు. అస్సలు నోరు జారితే చాలా దూరం వెళ్లిపోతుంది అందుకే ఏమీ చెప్పలేదని అన్నాడు. అలాగే, నామినేషన్ జరిగిన వెంటనే ప్రియాంక వచ్చి మాట్లాడేయాలని చూసింది చూశావా అంటూ చెప్పాడు. నామినేషన్స్ లో అన్ సీన్ లో ఇదే జరిగింది.
ప్రియాంక – శోభాశెట్టి – అమర్ ముగ్గురూ కూడా (Bigg Boss 7 Telugu) టాప్ 5 గురుంచి మాట్లాడుకున్నారు. అలాగే, శివాజీ నామినేషన్స్ లో పాయింట్ మాట్లాడుకుండా దాటేశారని చెప్పింది ప్రియాంక. అర్జున్ అలా అనలేదని దబాయిస్తున్నాడని శోభాశెట్టి చెప్పింది. ఇలా ముగ్గురూ మరోసారి మంతనాలు చేయడం స్టార్ట్ చేసారు. మరోవైపు యావర్ – ప్రశాంత్ – శివాజీ కూడా గౌతమ్ గురించి మాట్లాడుకున్నారు. గౌతమ్ మారాడని అనుకున్నానని ప్రశాంత్ అన్నాడు. వాళ్లు ఇంక మారరు అంటూ శివాజీ ముక్తాయింపు ఇస్తూ, ఇక్కడ కూడా ప్రియాంక గురించే మాట్లాడాడు. మొత్తానికి అదీ మేటర్.