Bigg Boss 7 Telugu: శివాజీ అలా చెప్పడం వల్లే విన్నర్ అవ్వలేకపోతున్నాడా ? తెరవెనుక సీక్రెట్స్ ఇవే..!

బిగ్ బాస్ హౌస్ లో ఆఖరివారం హౌస్ మేట్స్ టైమ్ పాస్ చేస్తున్నారు. జెర్నీలు అయిపోయిన తర్వాత ఇంటి నుంచీ ఫుడ్ వచ్చింది. వాటిని సంపాదించుకోవడానికి హాచ్చి ఏలియన్స్ వచ్చి హౌస్ మేట్స్ కి టాస్క్ లు పెట్టారు. ఫస్ట్ అర్జున్ కోసం వాళ్ల మిసెస్ పంపిన రాగి సంగటి – మటన్ కర్రీ వచ్చింది. దీనికోసం యావర్ షేక్ బేబీ షేక్ అనే టాస్క్ ఆడాడు. ఎవిక్షన్ పాస్ లో ఫౌల్ ఆడిన గేమ్ ఇప్పుడు జాగ్రత్తగా ఆడి అర్జున్ కోసం ఆహారం సంపాదించాడు.

ఆ తర్వాత ప్రియాంక బో అండ్ యార్ గేమ్ ఆడి శివాజీ కోసం ఇంటి నుంచీ వచ్చిన చికెన్ ని సంపాదించింది. ఆ తర్వాత అమర్ దీప్ కోసం వచ్చిన ఫ్రాన్స్ బిర్యానీ కోసం శివాజీ క్యాండీ బెలూన్ టాస్క్ ఆడాడు. ఇలా ఈ ముగ్గురికి వచ్చిన ఆహారాన్ని హౌస్ మేట్స్ ఎంజాయ్ చేసారు. ఆ తర్వాత హాచ్చికి బోర్ కొట్టిస్తున్నారంటూ హౌస్ మేట్స్ పై అలిగింది. దీంతో హౌస్ లోకి ముసుగులు వేసుకుని బిగ్ బాస్ టీమ్ వచ్చారు. వారితో కాసేపు ఫన్ చేసిన హౌస్ మేట్స్ తర్వాత బిగ్ బాస్ పెట్టిన సీరియస్ టాస్క్ ఆడారు.

బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఇంట్లో 1గంట పాటు టెలికాస్ట్ అయ్యే సమయంలో ఎవరు ఎక్కువ సేపు కనిపించి ఉంటారు అనేదానిపైన హౌస్ మేట్స్ ర్యాంకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడే మరోసారి శివాజీ అమర్ ని టార్గెట్ చేశాడు. అమర్ కి 5నిమిషాలు ఇచ్చాడు. అంతేకాదు, ఫస్ట్ నుంచీ కూడా అమర్ దీప్ ని శివాజీ టార్గట్ చేస్తునే ఉన్నాడు. ఏదో ఒక విషయంలో చులకనగా మాట్లాడుతునే ఉన్నాడు. ఇదే లీనియస్ తీస్కుని మిగతా వాళ్లు కూడా రెచ్చిపోయారు. నిజానికి శివాజీ ఇలా మొదటి నుంచీ చెప్పడం వల్లే అమర్ దీప్ రేస్ లో లేకుండా పోయాడనేది అమర్ దీప్ ఫ్యాన్స్ వాదన.

శివాజీ లేకపోతే యావర్ ఆట కానీ, పల్లవి ప్రశాంత్ ఆట కానీ వేరేలా ఉండేదని, వాళ్లు ఉత్తినే నోరు జారేవాళ్లని అప్పుడు ఎవరు బ్యాడ్ అయ్యేవాళ్లో ఆడియన్స్ కి తెలిసేదని చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా అమర్ దీప్ – శివాజీ కావాలనే ఇలా చేశారని తెరవెనుక దీనికోసం చాలా డ్రామా జరిగిందని కూడా టాక్ వినిపిస్తోంది. శివాజీ నామినేషన్స్ అప్పుడు కూడా అమర్ దీప్ – గౌతమ్ లని ఇలాగే సతాయించేవాడని, అంతకుముందు టేస్టీ తేజ కూడా శివాజీ నోటికి బలైపోయాడు.

ఇక ఆఖరివారంలో కూడా ముష్టిముఖాలు అంటూ సీరియల్ బ్యాచ్ పై డైలాగ్స్ వేశాడు శివాజీ. అంతేకాదు, అమర్ దీప్ ని డీగ్రేట్ చేసి మాట్లాడటం లాస్ట్ లో కూడా మానలేదని , టైమ్ ఇచ్చే టాస్క్ లో కూడా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాలని అంటున్నారు. ఇక ఈ సీజన్ లో కేవలం శివాజీ అడ్డుపడటం వల్లే అమర్ దీప్ విన్నర్ కాలేకపోతున్నాడనేది కూడా ఫ్యాన్స్ వాదన. మొత్తానికి అదీ మేటర్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus