Sivaji wife Shweta: ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న…మంచితనం కొందరికి ఉంటుంది: శివాజి

బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్గా కొనసాగుతున్నటువంటి హీరో శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన హౌస్ లో స్ట్రాంగ్ కంటెంట్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇక హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ లో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ని పండుగ సందర్భంగా నాగార్జున వేదిక పైకి ఇన్వైట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే శివాజీ కోసం తన భార్య శ్వేత అలాగే కుమారుడు రిక్కీ కూడా వేదిక పైకి వచ్చారు.

ఈ విధంగా బిగ్ బాస్ వేదికపై ఉన్నటువంటి శివాజీ భార్య శ్వేత నాగార్జున గారితో మాట్లాడుతూ ఈరోజు మేమంతా ఇలా ఉన్నాము అంటే అందుకు కారణం మీరు చిరంజీవి గారి సర్ అంటూ మాట్లాడారు. మేము ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అంటూ శ్వేత మాట్లాడటంతో వెంటనే నాగార్జున రియాక్ట్ అవుతూ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇలా ఉన్నారు అంటే కారణం నేను చిరంజీవి గారు కాదు నీ భర్త టాలెంట్ అంటూ చెప్పకు వచ్చారు.

శివాజి మాట్లాడుతూ ఇక్కడ ఉన్న వారికి మీ గురించి తెలియకపోవచ్చు కానీ బాబు గారు నాకు తెలుసు ఎంతో మంది టాలెంట్ ఉన్న వారందరిని ప్రోత్సహించి ఎంతో మందికి జీవితం కల్పించింది ఈ అన్నపూర్ణ స్టూడియో . అన్నపూర్ణ స్టూడియో ఎంతోమంది కొత్తవారిని ఆదరించి ప్రోత్సహించి నేడు వారికి అన్నం పెడుతుంది ఈ విషయాలన్నింటిని నేను కళ్లారా చూసాను బాబు గారు అంటూ (Sivaji) శివాజీ చెప్పుకొచ్చారు.

చాలామందికి సినీ, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండొచ్చు కానీ మంచితనం చాలా కొంతమందికే అరుదుగా ఉంటుంది అంటూ ఈ సందర్భంగా నాగార్జున పై శివాజీ ప్రశంసలు కురిపించగా నాగార్జున ఒక్కసారిగా థాంక్యూ సో మచ్ శివాజీ అంటూ చెప్పుకువచ్చారు. శివాజీ తన భార్య శ్వేత నాగార్జున చిరంజీవి గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus