టాలీవుడ్ పెద్దలు దసరా సీజన్‌ను అనాథగా వదిలేసినా.. చిన్న సినిమాలు, ఇతర భాషల పరిశ్రమలు అనాథగా ఏమీ వదల్లేదు. అందుదే అక్టోబరు రెండో వారానికి ఇప్పటివరకు ఆరు సినిమాలు ఫైనల్ అయ్యాయి. ఆఖరులో ఏమైనా ట్విస్ట్‌లు ఉంటే వీటి విషయంలో మార్పు జరగొచ్చు. ఇప్పటికైతే సూపర్ 6 తరహాలో ఓ ఆరు సినిమా విజయ దశమి సీజన్‌కు విజయం కోసం వస్తున్నాయి. పైన చెప్పినట్లు మాములుగా దసరాకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రావడం చాలా ఏళ్లుగా చూస్త వస్తున్నాం.
Movies
సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే సీజన్ కావడంతో ఈ అవకాశాన్ని వాడుకునేందుకు నిర్మాతలు ప్రయత్నించేవారు. కానీ ఈ సారి స్టార్ హీరోలు టాలీవుడ్ నుండి టైమ్‌కి సినిమా సిద్ధం చేయలేకపోయారు. దీంతో రజనీకాంత్‌కి (Rajinikanth) అప్పగించేశారు. అందుకే ఆయన అక్టోబర్ 10న ‘వేట్టయన్’తో (Vettaiyan) వస్తున్నారు. డబ్బింగ్ సినిమా అయినా మంచి సంఖ్యలో సినిమాకు థియేటర్లు దొరుకుతున్నాయని టాక్. ఎందుకంటే పెద్దగా పోటీ లేదు.
ఇక 11న గోపీచంద్ (Gopichand) – శ్రీను వైట్ల (Srinu Vaitla) ‘విశ్వం’ (Viswam) వస్తుంది. ఇద్దరకీ విజయం అత్యవసరం అయిన సినిమా ఇది. మరి ఎలాంటి ఫలితం తెచ్చుకుంటుందో చూడాలి. ఇక సక్సెస్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న సుధీర్ (Sudheer Babu) ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero) అంటూ వస్తున్నాడు. కన్నడ హీరో ధృవ సర్జ హీరోగా ‘మార్టిన్’ అనే సినిమా చేశాడు. 11 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో వయొలెంట్ యాక్షన్ బలంగా ఉంటుంది అని ప్రచార చిత్రాలు చూస్తే తెలుస్తోంది.
వీటితోపాటు అలియా భట్ (Alia Bhatt) బాలీవుడ్ మూవీ ‘జిగ్రా’ని తెలుగు డబ్బింగ్ చేసి అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. 12న సుహాస్ (Suhas) ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka) సినిమాను దిల్ రాజు (Dil Raju) తీసుకొస్తున్నారు. ఫైనల్‌గా యానిమల్ (Animal) ఇంటిమేట్ బ్యూటీ త్రిప్తి డిమ్రి (Tripti Dimri) నటించిన ‘విక్కీ విద్య కా వో వాలా వీడియో’ అదే రోజు రానుంది. పెద్ద హీరోలు వదిలేసిన దసరాకు వచ్చే ఈ సినిమాలు ఎంతవరకు రాణిస్తాయో చూడాలి.