విజేతగా నిలవడం సులభమే.. విజేతగా కొనసాగడమే కష్టమని కొందరు అంటుంటారు. అది ఎంత కష్టమో రాజమౌళికి చాలా బాగా తెలిసి ఉంటుంది. మొదటి సినిమా నుంచి ఎక్కడా డ్రాప్ అవ్వకుండా సినిమాకి సినిమాకి కలక్షన్స్ పెంచుకుంటూ వెళుతున్నారు. తెలుగు చిత్రపరిశ్రమలో అపజయం ఎరుగని డైరక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. ఆ పేరుని నిలబెట్టుకోవడానికి రాజమౌళి మరింత కష్టపడుతున్నారు. బాహుబలి చిత్రాల తర్వాత అతను మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించబోతున్న ఈ చిత్రం కోసం సెట్స్ పనులు కూడా మొదలయ్యాయి. అయితే స్క్రిప్ట్ ఫైనల్ కాలేదని తెలిసింది.
విజయేంద్ర ప్రసాద్ రైటర్స్ టీమ్ రాజమౌళిని కథ విషయంలో మెప్పించినప్పటికీ.. స్క్రిప్ట్ విషయంలో పూర్తిగా సంతృప్తి పరచలేకపోయిందని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఇప్పటికే ఒకటి కాదు రెండు కాదు.. ఐదుసార్లు స్క్రిప్ట్ ని రాజమౌళి రిజెక్ట్ చేశారు. తాజాగా ఆరవ డ్రాఫ్ట్ చదివిన రాజమౌళికి ప్రీ క్లైమాక్స్ నచ్చకపోవేసరికి దాన్ని కూడా రిజెక్ట్ చేసినట్లు తెలిసింది. ఇంకా స్క్రిప్ట్ లాక్ కాకపోయేసరికి రాజమౌళి కొంచెం ఆందోళన పడుతున్నట్టు టాక్. విజయేంద్ర ప్రసాద్ టీమ్ మళ్ళీ ఏడవ డ్రాఫ్ట్ రాసే పనిలో పడ్డారు. ఇది కంప్లీట్ కావడానికి మరో నెల పట్టేట్టు ఉంది. అయితే షూటింగ్ నవంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా పడడం ఖాయమని సినీ వర్గాలు తెలిపాయి.