Indian 2: అందుకే నిర్మాతలు కోర్టుకెక్కారా.. సగం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే..!

కోవిడ్ తర్వాత కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. అందుకే సినీ పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో ఫిలిం మేకింగ్ అనేది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. పేపర్ పై అనుకున్న బడ్జెట్ కి.. సెట్స్ పైకి వెళ్లిన తర్వాత అయ్యే బడ్జెట్ కి.. ‘నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా’ మాదిరి ఉంటుంది. అందుకే బడా నిర్మాతలు సైతం నిర్మాణం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Indian 2

సినిమా బడ్జెట్ కి రిటర్న్స్ వస్తాయి అనుకుంటేనే ముందడుగు వేస్తున్నారు. లేదు అంటే ఆ ప్రాజెక్టుని పక్కన పెట్టేస్తున్నారు. అదే స్టార్ డైరెక్టర్ తో సినిమా అయితే లెక్కకు మించి ఖర్చు పెట్టేస్తున్నారు.శంకర్ (Shankar)  వంటి పెద్ద డైరెక్టర్ తో సినిమా చేయాలంటే పెద్ద సాహసమే. ‘ఇండియన్ 2’ (Bharateeyudu 2) విషయంలో ‘లైకా’ వారు ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టేశారు.

సగం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే ‘ఇండియన్ 2’ (Indian 2) బడ్జెట్ హద్దులు దాటింది అంటూ వారు కోర్టుకెక్కారు అంటే విషయం అర్ధం చేసుకోవచ్చు. పోనీ కిందా మీదా పడి సినిమా కంప్లీట్ చేసినా.. అది హిట్ అయ్యింది అంటూ లేదు. సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే… ‘ఇండియన్ 2’ లో ఎస్.జె.సూర్య  (SJ Suryah) పాత్ర అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒళ్ళంతా బంగారం వేసుకుని కనిపిస్తాడు అతను.

ఇక ఆ పాత్రకు సంబంధించిన ఇల్లు కూడా చాలా రిచ్ గా కనిపిస్తుంది. వాస్తవానికి అది సెట్ అట. కేవలం దాని కోసమే దర్శకుడు శంకర్ నిర్మాతతో రూ.8 కోట్లు ఖర్చు చేయించాడట. వినడానికి షాకింగ్ గా ఉంది కదూ. ఓ ఇంటర్వ్యూలో ఎస్.జె.సూర్య ఈ విషయాన్ని రివీల్ చేశాడు. నిజజీవితంలో ఆ డబ్బుతో మంచి లగ్జరీ హౌస్ కూడా కొనుక్కోవచ్చు. కానీ సెట్ కే శంకర్ అంత ఖర్చు చేయించాడట.

మొత్తానికి ఓపెన్ అయిన హేమ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus