Jr NTR: తారక్ ఫ్యాన్ గొప్పదనం చెప్పిన ఎస్కేఎన్.. ఏమైందంటే?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బేబి మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాత అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్కేఎన్ మాట్లాడుతూ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఎస్కేఎన్ మెగా ఫ్యామిలీ వీరాభిమాని కాగా మెగా ఫ్యామిలీ వల్లే ఈ స్థాయిలో సక్సెస్ సాధించానని ఆయన చెబుతారు.

ఎస్కేఎన్ మాట్లాడుతూ తాను ప్రభాస్, రవితేజలకు పీఆర్ గా పని చేయడంతో ఆ ఇద్దరు హీరోల అభిమానులు సైతం నన్ను ఎంతగానో అభిమానించారని ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు. అయితే టాక్సీవాలా సినిమా విడుదలకు ముందే పైరసీ కాగా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఒకరు తనకు ఫోన్ చేసి జంగారెడ్డి గూడెంలో టాక్సీవాలా మూవీ సీడీ వేసి అమ్ముతున్నారని చెప్పి వాళ్లను పోలీసులకు పట్టించడంలో సహకరించాడని ఎస్కేఎన్ అన్నారు.

తాను మెగా వీరాభిమాని అని తెలిసినా (Jr NTR) తారక్ ఫ్యాన్ సహాయం చేశాడని ఎందుకు సహాయం చేశావని అడిగితే మనమంతా తెలుగు హీరోల అభిమానులమేనని చెప్పాడని ఎస్కేఎన్ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఫ్యాన్ గురించి ఎస్కేఎన్ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఎస్కేఎన్ బేబి సినిమా ప్రమోషన్స్ కోసం కూడా భారీ స్థాయిలో ఖర్చు చేశారు.

ఈ సినిమాకు పోటీగా రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలవుతూ ఉండటంతో ఈ సినిమాలలో బేబి పై చేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది. బేబి సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బేబి సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తే అటు ఆనంద్ దేవరకొండకు, ఇటు వైష్ణవి చైతన్యకు సక్సెస్ దక్కుతుందేమో చూడాలి. తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు సక్సెస్ దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus