Sobhan Babu, Venkatesh: శోభన్ బాబు హిట్టు సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన వెంకటేష్..!
- November 15, 2021 / 09:57 PM ISTByFilmy Focus
ఒకప్పటి స్టార్ హీరో శోభన్ బాబు గురించి ఇప్పటి యువతకి ఎక్కువగా తెలిసుండదు. కానీ ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలకి చమటలు పట్టించిన వారిలో ఈయన కూడా ఒకరు. ఫ్యామిలీ స్టోరీలు చేసే బ్లాక్ బస్టర్లు కొట్టిన ఘనత శోభన్ బాబు సొంతం. అప్పట్లో శోభన్ బాబు ఓ కథని రిజెక్ట్ చేస్తే…. ఆ కథని అంత ఈజీగా ఎవ్వరూ ఓకే చేసేవారు కాదట. కానీ ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసిన హీరో మాత్రం వెంకటేషే అని తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే.. వెంకటేష్ హీరోగా రూపొందిన హిట్ సినిమాల్లో ‘శత్రువు’ కూడా టాప్ ప్లేస్ లో ఉంటుంది.విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ కథని మొదట శోభన్ బాబుకి వినిపించారట నిర్మాత యం.ఎస్.రాజు. ఆయనే ఈ చిత్రానికి కథ అందించడం మరో విశేషం. అయితే శోభన్ బాబుకి.. ఈ కథ నచ్చినప్పటికీ నో చెప్పారట. అంతేకాదు నిర్మాత కావాలనుకుంటున్న యం.ఎస్.రాజు నిర్ణయానికి కూడా ఆయన ఏకీభవించలేదు.

సినిమాకి బదులు ఆ డబ్బుని రియల్ ఎస్టేట్ లో పెట్టమని.. ఒకవేళ సినిమా ప్లాప్ అయితే మన మధ్య మనస్పర్థలు కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పారట. కానీ యం.యస్.రాజు గారు పట్టువిడువని విక్రమార్కుడు లా ప్రయత్నించి… అదే కథని వెంకటేష్ తో రూపొందించి సూపర్ హిట్ అందుకున్నారు.ఆయన టాలీవుడ్లో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగడానికి ఈ సినిమా బాగా హెల్ప్ చేసింది.
పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

















