బిగ్ బాస్ 4: హారికలో ఉన్న క్వాలిటీ అదే..!

బిగ్ బాస్ సీజన్ 4 అనేది ఆఖరి దశకి చేరుకుంది. ఇంకోక్కవారమే ఎలిమినేషన్ ప్రోసెస్ అనేది జరగబోతోంది. ఆ తర్వాత మిగిలిన పార్టిసిపెంట్స్ అందరూ టాప్ – 5 కి వెళ్లిపోయనట్లే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇచ్చిన రూలర్ టాస్క్ ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు హౌస్ మేట్స్ అందరూ. ఫస్ట్ సోహైల్ రాజుగా కిరీటం పెట్టుకున్న దగ్గర్నుంచీ ఫన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత అభిజిత్ కూల్ గా కింగ్ డమ్ చేస్తే, హారిక తనదైన స్టైల్లో రెచ్చిపోయింది. అఖిల్ ని మంత్రిగా పూర్తిగా వినియోగించుకుంటూ సోహైల్ తో ఆడుకుంది.

ఇక్కడే సోహైల్ కి హారిక ఇచ్చే పనిష్మెంట్స్ నచ్చలేదు. అంతేకాదు, అఖిల్ హారికకి సలహాలు ఇస్తుంటే తట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా తనని ప్రపోజ్ చేస్తూ పొగడటం అనే టాస్క్ ఆడమంటే అది ఈజీగా ఉంటుంది వేరేది ఇమ్మన్నాడు అఖిల్. అందుకే సోహైల్ కి కోపం వచ్చింది. మధ్యలో హారిక సోహైల్ ఎందుకు హర్ట్ అయ్యాడో తెలుసుకోలేకపోయింది. ఆతర్వాత అఖిల్ ఎక్స్ ప్లైన్ చేసేసరికి హారిక ఒఖ మంచి పని చేసింది.

అందరినీ పిలిచి, తన రాజ్యంలో ప్రజలు ఏమన్నా తనవల్ల ఇబ్బందులు పడుతున్నారా అనేది అందర్నీ మాట్లాడమంది. దీంతో సోహైల్ అఖిల్ ఇద్దరూ కూడా అక్కడ వాదించుకున్నారు. సోహైల్ అడిగిన ప్రశ్నలకి సాలిడ్ గా ఆన్సర్ చెప్పింది హారిక. అంతేకాదు, సోహైల్ అక్కడ మిస్ కమ్యూనికేషన్ అయినదానికి క్లారిటీ కూడా ఇచ్చింది. నిజానికి హారికలో ఉన్న క్వాలిటీ ఇదే. ఏదైనా ఇష్యూ ఉంటే తన తరపునుంచి ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చేందుకు చూస్తుంది. అలాగే చేస్తుంది కూడా. అదీ విషయం.

[yop_poll id=”1″]

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus