బిగ్ బాస్ 4: సోహైల్ అరుపులకి ఆవేదన చెందిన అరియానా..!

బిగ్ బాస్ హౌస్ లో ఓపిక టాస్క్ లో ఎవరికీ ఓపిక లేకుండా ఆర్గ్యూమెంట్స్ అనేవి పీక్స్ లోకి వెళ్లాయి. హారిక ఛైర్ పైన కూర్చున్నపుడు సోహైల్ కి అరియానాకి పెద్ద యుద్ధమే జరిగింది. ఫస్ట్ సోహైల్ ఛైర్ పై ఉన్నపుడు ఈ టాస్క్ అయ్యాక నాకు క్లారిటీ కావాలి సోహైల్ అంటూ అరియానా సోహైల్ ని మాటలతో రెచ్చగొట్టింది. అన్నింటికీ ఆన్సర్ ఇస్తాను అంటూ సోహైల్ కావాలనే చేశాను. నువ్వు ఆడిన టాస్క్ లు కూడా అలాగే అనిపించాయి నాకు.

ఇప్పుడు రివేంజ్ తీర్చుకున్నాను అన్నాడు. దీంతో నాకు కావాల్సిన ఆన్సర్ ఇదే అంటూ అరియానా సోహైల్ తో మాట్లాడింది. అంతేకాదు, ఇదే యూనిటీ అంటే చూశారా.. అంటూ మాట్లాడేసరికి సోహైల్ మాటకి మాట చెప్పాడు. నీకు బొమ్మ ఎక్కువ మనుషులు ఎక్కువ అంటూ మాట్లాడాడు. బొమ్మకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మనుషులకి ఇవ్వు అంటూ మాట్లాడాడు. దీంతో అరియానా ఆవేశపడింది. మాటకి మాట చెప్పింది. ఇక్కడే సోహైల్ ఆవేశంగా అరియానాపైకి వచ్చి, నన్ను రాక్షసుల టాస్క్ లో , బేబీ కేర్ టాస్క్ లో ఆట ఆడుకున్నావ్ అప్పుడు నీ క్రూయాలిటీ తెలియలేదా అంటూ మాట్లాడాడు. ఇప్పుడు పెద్ద నీతులు చెప్పకు అన్నట్లుగా మాట్లాడాడు. ఈ ఆర్గ్యూమెంట్ అనేది చాలా దూరం వెళ్లిపోయింది. అభిజిత్ అరియానాని ఓదారిస్తే, అఖిల్ సోహైల్ ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు.

ఈ ఎపిసోడ్ లో అరియానా కొన్ని పాియంట్స్ లో రాంగ్ ఉంటే, ఆవేశంగా మాట్లాడుతూ దూకుడుగా ప్రవర్తిస్తూ సోహైల్ తప్పుచేశాడు. బీప్ వేసేంతలా డైలాగ్స్ వేశాడు అంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అని అర్ధం అవుతోంది. ఇక్కడ సోహైల్ కూడా మిస్టేక్ చేశాడు. ఇక సోహైల్ తనపైకి వచ్చి అరిచిన అరుపులకి ఎంతో ఆవేదన చెందింది అరియానా. అంతకుముందు అరియానా అన్న మాటలకి మోనాల్ కూడా వెక్కి వెక్కి ఏడ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సిట్యూవేషన్ లో అరియానా ఉండేసరికి మోనాల్ చూడలేకపోయింది. అరియానాతో మాట్లాడే ప్రయత్నం చేసింది. మళ్లీ తిరిగి మామూలు మనిషి అయ్యేసరికి చాలా సమయం పట్టింది అరియానాకి. ఇప్పుడు ఇద్దరూ నామినేషన్స్ లో ఉన్నారు కాబట్టి ఎవరికి ఇది ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుంది అనేది చూడాలి.

[yop_poll id=”1″]

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus