రాజమౌళి సినిమాలెప్పుడూ అనుకున్న సమయానికి రావు. ఆయన ఏడాది టార్గెట్ పెట్టుకుంటే అది కనీసం రెండేళ్లు పడుతుంది. ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఇది మరింత పెరిగేలా కనిపిస్తుంది. జులై 2020 నుండి జనవరి 2021 కి ఈ మూవీ విడుదల తేదీ మారింది. జనవరిలో కూడా ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం లేదు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ మరింత ఆలస్యం అవుతుంది. అలాగే రాజమౌళి ముందుగా అనుకున్న షెడ్యూల్ మొత్తం ఖరాబు అయ్యింది. రాజమౌళి అనుకున్న లొకేషన్స్ లో షూటింగ్ జరపలేని పరిస్థితి నెలకొని ఉంది.
లాక్ డౌన్ సడలింపుల వలన మళ్ళీ షూటింగ్ మొదలైనా నటులు అందుబాటులోకి రావడం కష్టం. వివిధ పరిశ్రమలతో పాటు, వివిధ దేశాల నటులు ఈ మూవీలో నటిస్తున్న నేపథ్యంలో వారందరూ ఈ మూవీ షూటింగ్ లో ఎలా పాల్గొంటారు అనే దానిపై రాజమౌళి దగ్గరే సమాధానం లేదని తెలుస్తుంది. మరో వైపు ఈ సమస్యలన్నిటికీ ఎదో సెంటిమెంట్ కారణం అని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. వరుసగా ఎదురవుతున్న అపశకునాలకు ఎదో ఓ విషయం కారణం అని వారు భావిస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైన కొన్నాళ్ళకు ఎన్టీఆర్, చరణ్ లు గాయాల పాలు కావడం, ఎన్టీఆర్ హీరోయిన్ మధ్యలో ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం, ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య అనారోగ్యానికి గురికావడం ఇలా వరుస ఇబ్బందులు ఈ సినిమాకు ఎదురవుతున్నాయి. రాజమౌళి గతంలో ఎన్నడూ చూడని ఇబ్బందులు, సమస్యలు ఈ చిత్రం విషయంలో ఎదుర్కొంటున్నారు. అసలు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి అయ్యేనో, ఎప్పుడు విడుదలయ్యేనో చెప్పలేని పరిస్థితి.