మెగా హీరోలు (Mega Family) హీరోయిన్లను ప్రేమించడం అనేది తరతరాలుగా వస్తున్న ఆచారం. దాదాపుగా ఆ ఫ్యామిలీలో హీరోలందరూ ఏదో ఒక సందర్భంలో తమ తోటి హీరోయిన్ లేదా ఇండస్ట్రీలో హీరోయిన్ తో ప్రేమలో పడ్డారు. రీసెంట్ గా వరుణ్ తేజ్ ఏడేళ్లపాటు ప్రేమించిన లావణ్య త్రిపాఠిని (Lavanya Tripathi) పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఇప్పుడు వరుణ్ తేజ్ (Varun Tej) బాటలోనే మరో మెగా హీరో కూడా పయనిస్తున్నాడని తెలుస్తోంది. వాళ్లిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించనప్పటికీ..
మెగా ఫ్యామిలీ ఈవెంట్స్ కి ఆ హీరోయిన్ హాజరవ్వడం, ఆమె సోషల్ మీడియా ఫొటోలకి సదరు హీరో అందరికంటే ముందు లైకులు కొట్టడం అనేది చర్చనీయాంశం అయ్యింది. దాంతో వీళ్లిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారేమో అనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ హీరోయిన్ వయసులో హీరోకంటే దాదాపు 5 ఏళ్లు పెద్ద. వయసు అనేది ప్రామాణికం కాకపోయినప్పటికీ.. అదో టాపిక్ అయ్యే అవకాశం మాత్రం గట్టిగానే ఉంది.
మరి ఈ రూమర్ ను నిజంగానే పెళ్లి దాకా ఆ యువజంట తీసుకెళ్తారా లేక కొన్నాళ్లపాటు సైలెంట్ గా ప్రేమాయణం కొనసాగిస్తారా? అనేది వాళ్ల నిర్ణయమే అనుకోండి. ఆల్రెడీ ఆమె ఈ రిలేషన్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు కూడా తగ్గిస్తూ వస్తోంది. సదరు హీరో కూడా ప్రస్తుతం ఎలాంటి సినిమా చేయడం లేదు. మరి వీరి పర్సనల్ & ప్రొఫెషనల్ లైఫ్ లకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ ఎప్పడు వస్తుందా అని ప్రస్తుతం చర్చనీయాంశమైన విషయం.