Sooseki The Couple Song: ‘పుష్ప 2’ సెకండ్ సింగిల్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

‘పుష్ప 2 ‘ (Pushpa 2: The Rule)  నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. మొదట దీనికి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తర్వాత అందరూ బాగానే ఓన్ చేసుకుని ఎక్కువగా విన్నారు. అది ‘పుష్ప’ ఆటిట్యూడ్ ని తెలిపే సాంగ్. ఇక రెండో సింగిల్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఇది రొమాంటిక్ సాంగ్. ఈ లిరికల్ సాంగ్ విశేషమేమిటంటే.. షూటింగ్ స్పాట్ లో టీం అంతా ఈ సాంగ్ కి డాన్సులు చేస్తున్నట్టు విజువల్స్ జోడించారు.

‘వీడు మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్నా పసి పిల్లవాడు నా వాడు, వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు మా వాడు’ అంటూ ఈ సాంగ్ మొదలైంది. ‘సూసేకి అగ్గి రవ్వ మాదిరి ఉంటాడే నా సామి’ అనే లిరిక్ వచ్చినప్పుడు మంచి హై ఇస్తుంది. శ్రీవల్లి… అంటే పుష్ప భార్య పైకి కఠినంగా కనిపించే అతని మనసు ఎలా ఉంటుంది? అనేది వర్ణిస్తూ ఈ రొమాంటిక్ సాంగ్ ని రాశారు చంద్రబోస్ (Chandrabose).

సింగర్ శ్రేయ గోషల్ (Shreya Ghoshal) ఎంతో ఇన్వాల్వ్ అయ్యి ఈ పాట పట్టినట్టు స్పష్టమవుతుంది. దేవి శ్రీ ప్రసాద్  (Devi Sri Prasad)  అందించిన ట్యూన్ ఏమీ కొత్తగా లేదు.. కానీ లిరిక్స్ మాత్రం క్యాచీగా ఉండటంతో 2 , 3 సార్లు విన్న తర్వాత పాట ఎక్కేసే ఛాన్స్ ఉంది. సిట్యుయేషనల్ సాంగ్ కాబట్టి.. సినిమా చూస్తున్నప్పుడు లేదా సినిమా చూశాకా.. ఇంకా నచ్చొచ్చు. మీరు కూడా ఒకసారి వినండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags