Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movies » Sourav Ganguly: సౌరభ్‌ జీవితం… తెరపైకి మంచి కమర్షియల్‌ హిట్‌ పక్కా!

Sourav Ganguly: సౌరభ్‌ జీవితం… తెరపైకి మంచి కమర్షియల్‌ హిట్‌ పక్కా!

  • September 11, 2021 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sourav Ganguly: సౌరభ్‌ జీవితం… తెరపైకి మంచి కమర్షియల్‌ హిట్‌ పక్కా!

టీమిండియా క్రికెట్‌ చరిత్రలో కనీసం ఒక్క పేజీ అయినా ఉంటే చాలు అనుకుంటుంటారు మన క్రికెటర్లు. అలాంటి పేజీ ఏం ఖర్మ… ఏకంగా పేజీలు పేజీలు రాసి పెట్టున్నాయ్‌ ఆ ఆటగాడికి. టీమిండియా క్రికెట్‌కు వేగం, తెగువ చూపించిన ఆ క్రికెటరే సౌరభ్‌ గంగూలీ. ఇప్పుడు ఆయన మీద సినిమా తీయడానికి బాలీవుడ్‌ దర్శకుడు ఒకరు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కచ్చితంగా పాన్‌ ఇండియానే అవుతుంది. అయితే మరి ఈ సినిమాలో ఏమేం చూపించబోతున్నారు. ఇదే ఈ రోజు పాయింట్‌.

* క్రికెటర్లలో గంగూలీది భిన్నమైన మసస్తత్వం అంటారు. చెప్పాలనుకున్న మాటను తర్వాతి పరిణామాలను పట్టించుకోకుండా అనేస్తుంటాడు. అలా ఓ సమయంలో జట్టు యాజమాన్యంతో విభేదించి నాలుగేళ్లు (1992 నుండి 1996) టీమిండియా జెర్సీకి దూరమయ్యాడు.

* ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో గంగూలీకి గొప్ప రికార్డులు ఉన్నాయి. అంతేకాదు అదే మైదానంలో నాట్‌వెస్ట్‌ ట్రోఫీ గెలుచుకున్నాక జెర్సీ తీసి గాల్లో ఊపుతూ విజయానందం ప్రదర్శించాడు. దానిపై అప్పట్లో దుమారం రేగింది. కానీ అవేవీ దాదా పట్టించుకోలేదు.

* 199-2000లో టీమ్‌ఇండియా స్పాట్‌ఫిక్సింగ్‌ కుంభకోణంలో ఇరుక్కోవడంతో.. గంగూలీ అనుకోకుండానే కెప్టెనయ్యాడు. జట్టును ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరి మన్ననలు పొందాడు. చిన్న వయసులోనే పరిణితి చూపించి, కీలక సమయంలో జట్టును సమతూకంగా నడిపి శభాష్‌ అనిపించుకున్నాడు.

* 2005లో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా గ్రేగ్‌ ఛాపెల్‌ను తీసుకురావడంలో గంగూలీ కీలక పాత్రపోషించాడు. విదేశీ కోచ్‌ అయితే బాగుంటుందని బీసీసీఐకి నచ్చజెప్పి మరీ ఛాపెల్‌ను తీసుకొచ్చాడు. అయితే, తర్వాతి కాలంలో అతడి వల్లే జట్టు నుంచి దూరం కావడం గమనార్హం.

* విజయవంతమైన ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్న సమయంలోనే వివిధ కారణాల వల్ల… 2008లో ఆటకు గుడ్‌బై చెప్పాడు దాదా. ఆ తర్వాత బెంగాల్‌ క్రికెట్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అ తర్వాత బీసీసీఐ బాస్‌గా కొనసాగుతున్నాడు. ఇందులోనూ తనదైన దూకుడు చూపిస్తున్నాడు.

* గంగూలీ జీవితం బయోపిక్‌గా వెండితెరపైకి రానున్న నేపథ్యంలో ఆ పాత్ర ఎవరు పోషిస్తారు అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఓ సందర్భంలో దాదా మాట్లాడుతూ… తన బయోపిక్‌లో హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్ర నటిస్తే బాగుంటుంది అన్నాడు. మరి హృతిక్‌ ఏమంటాడో చూడాలి. అయితే అభిమానులు, నెటిజన్లు మాత్రం రణ్‌బీర్‌ కపూర్‌ అంటున్నారు.

* ఇది కాకుండా చర్చకు వస్తున్న మరో అంశం ఈ సినిమాలో సచిన్‌ ఎవరు అని. దాదా కెరీర్‌లో సచిన్‌ చాలా కీలకం. సచిన్‌ లేకుండా కొన్ని సీన్స్‌ ముందుకెళ్లవు. మరి ఆ పాత్రలో ఎవరు నటిస్తారు అనేదీ కీలకం.

* గంగూలీకి… ఓ కథానాయికతో అఫైర్‌ ఉంది అంటూ ఆ రోజుల్లో గట్టిగా పుకార్లు వినిపించేవి. వాటిపై ఎవరూ అధికారికంగా స్పందించింది లేదు. మరి వాటిని ఈ బయోపిక్‌లో టచ్‌ చేసి… ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

* దీంతోపాటు గంగూలీది ప్రేమ వివాహం. చిన్ననాటి స్నేహితురాలు డోనాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తొలినాళ్లలో వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదట. ఈ ప్లాట్‌లన్నీ చూస్తుంటే ఒక కమర్షియల్‌ సినిమాకు కావాల్సిన అన్ని హంగులు దాదా లైఫ్‌లో ఉన్నాయి. మరి వాటిని ఎలా తెరపై పండిస్తారో చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sourav Ganguly
  • #sourav ganguly biopic

Also Read

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

Subham Collections: ‘శుభం’ .. రెండో వీకెండ్ కూడా కలిసొచ్చినట్టే..!

related news

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Naveen Polishetty: నవీన్ పోలిశెట్టి – మణిరత్నం కాంబోలో సినిమా.. నిజమేనా?

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

తెలంగాణ కల్నల్ పాత్రలో బాలీవుడ్ స్టార్.. మరో ఆర్మీ బయోపిక్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Balakrishna: బాలకృష్ణ.. ఇక టైమ్ వృధా చేయకుండా మాస్ ప్లాన్!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

The Paradise: ది ప్యారడైజ్ లో పవర్ఫుల్ సైకో విలన్!

trending news

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!

3 hours ago
Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

Vishal: ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి.. హైట్ బాగా సెట్ అవ్వుద్ది!

4 hours ago
Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

7 hours ago
Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

Manchu Manoj: మీడియాని తన వైపు తిప్పుకునేందుకు మనోజ్ ప్రయత్నాలు..?

7 hours ago
#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

#Single Collections: ‘సింగిల్’.. సూపర్ హిట్ లిస్టులోకి చేరిపోయింది ..!

8 hours ago

latest news

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

Chiranjeevi: చిరంజీవితో ఉన్న ఆ చిన్నారి.. క్లిన్ కారా కాదు!

5 hours ago
Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

Atlee: బన్నీతోనే మూడో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న అట్లీ!

5 hours ago
Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

Chiranjeevi: అనిల్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసిన చిరు.. కారణం అదే..!

5 hours ago
తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

తన బాలీవుడ్ డెబ్యూ మూవీ ఫలితం గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కామెంట్స్!

6 hours ago
Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

Vijay Kanakamedala: పవన్‌ కల్యాణ్‌తో ‘భైరవం’ డైరక్టర్‌.. ఆ రోజు అరెస్టు పని జరగకపోయుంటే..!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version