పూరి జగన్నాథ్.. తెలుగు పరిశ్రమలో పరిచయం అవసరం లేని డైరక్టర్. బద్రి, ఇడియట్, అమ్మ, నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, టెంపర్ వంటి ఎన్నో హిట్లు సాధించారు. తాజాగా కళ్యాణ్ రామ్ తో ఇజం చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన లో స్పెషల్ క్వాలిటీస్ పై ఫోకస్..
1. బాల్యంలో రచనలుపూరి జగన్నాథ్ కుటంబసభ్యుల్లో సినీ పరిశ్రమకు చెందిన వారు ఎవరూ లేరు. అయినా పూరికి చిన్నప్పటినుంచి కథలు రాయడం అలవాటైంది. ఆరో తరగతిలోనే మంచి కథరాసి అందరితో అభినందనలు అందుకున్నారు. తల్లి దండ్రుల ప్రోత్సాహంతో సినీపరిశ్రమలో అడుగుపెట్టి టాప్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.
2. కథని నమ్మే డైరక్టర్పూరి జగన్నాథ్ డైరక్టర్ గా నిరూపించుకోక ముందు నుంచే తన రాసిన కథకే ఫిక్స్ అయ్యేవారు. బద్రి సినిమా కథ పవన్ విన్నప్పుడు క్లైమాక్స్ మార్చమని చెప్పారు. కానీ పూరి క్లైమాక్స్ ని మార్చలేదు. అది నచ్చే పవన్ బద్రిని ఒకే చేశారు. ఈ డైరక్టర్ ఇప్పటికీ హీరోల కోసం కథను మార్చరు.
3. వేగంగా స్క్రిప్ట్ఒక సినిమా స్క్రిప్ట్ రాసేందుకు సాధారణంగా మూడు నెలలు పడుతుంది. పూరి మాత్రం తన సినిమా స్క్రిప్ట్స్ ని 15 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇందుకోసం ఆయన థాయిలాండ్ వెళుతుంటారు. అక్కడ పట్టాయ బీచ్ లో కూర్చొని చకచక రాసేస్తారు.
4. శ్రీ శ్రీ స్ఫూర్తిపూరి టీనేజ్ లోనే శ్రీ శ్రీ రచనలన్నీ చదివేసారు. తన రచనలపై శ్రీశ్రీ ప్రభావం ఉంటుంది. దర్శకత్వంలో జగన్ కి స్ఫూర్తి కె.బాల చందర్, మణిరత్న.
5. డిఫరెంట్ టేస్ట్సినిమాలకు పేర్లు పెట్టడం దగ్గర నుంచి క్యారక్టర్ డిజైన్ వరకు పూరి జగన్నాథ్ డిఫరెంట్ గా ఆలోచిస్తారు. రొటీన్ ని బీట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి దానికి ఒక ఉదాహరణ “నేను నా రాక్షసి”. ఈ మూవీ కోసం విశ్వ, అనూప్ రూబెన్స్, రెహ్మాన్ ముగ్గురు సంగీత దర్శకులతో పాటలను కంపోజ్ చేయించారు.
6. పూరి కనెక్ట్స్సినిమాల్లోకి అడుగు పెట్టాలనేది చాలా మంది కల. అటువంటివారి కోసం పూరి హీరోయిన్ ఛార్మితో కలిసి ఒక స్టేషన్ ని ఏర్పాటు చేశారు. పూరి కనెక్ట్స్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసి తెలుగు తెరకు అందమైన హీరోయిన్లను పరిచయం చేస్తున్నారు.