దర్శకుడు రాజమౌళికి ఇంత వరకు పరాజయం అంటే తెలియదు. ఆయన ఇప్పటివరకు తీసిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్ అండ్ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాయి . అయితే రాజమౌళి చెప్పిన సమయానికి సినిమా విడుదల చేసింది తక్కువ సార్లు మాత్రమే. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకొని సినిమాను చెక్కే రాజమౌళి సమయం అధికంగా తీసుకుంటారు. ఇక ఆర్ ఆర్ ఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఆయన మొదటిసారి సినిమా ప్రకటన రోజే విడుదల తేదీ ప్రకటించారు. ఆర్ ఆర్ ఆర్ జులై 30, 2020లో విడుదల కానుందంటూ ఆయన ప్రకటించడం జరిగింది.
ఐతే మళ్ళీ యధావిధిలాగా ఆర్ ఆర్ ఆర్ విడుదల ఆరు నెలలు వాయిదా వేశాడు. వాయిదాకి అసలు కారణం అనుకున్న ప్రకారం చిత్రీకరణ జరగలేదు. దీనికి అనేక కారణాలుండగా అందులో ప్రధానంగా చరణ్, ఎన్టీఆర్ గాయాలపాలు కావడం. చరణ్, ఎన్టీఆర్ ఒకరి తరువాత ఒకరు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో గాయాలపాలయ్యారు. వీరు కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. దీనితో అనుకున్న సమయానికి చిత్రీకరణ జరగలేదు. దీనితో ఈ పరిస్థితి మరలా రాకూడని రాజమౌళి గట్టిగా నిర్ణయించుకున్నారు. దీనికోసం ఆయన నిపుణులను తీసుకోవడం జరిగింది. యుద్ధ పోరాటాలు, గుర్రపు స్వారీలు, ఛేజింగ్స్, జంపింగ్స్ వంటి సన్నివేశాల చిత్రీకరణ నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారట. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలకు గాయాలైతే మూవీ విడుదల మరో మారు వాయిదాపడుతుంది. అందుకే రాజమౌళి సేఫ్టీ విషయంలో చాల కేర్ఫుల్ గా ఉంటున్నారని తెలుస్తుంది.
Most Recommended Video
పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!