టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంత మంది స్టార్ హీరోలకు కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్కెట్లోకి కొత్త మోడల్ వస్తే కొందరైతే చాలా తొందరగా బుక్ చేసుకుంటూ ఉంటారు. వారి లగ్జరీ లైఫ్ కి అనుగుణంగా ఉండేలా మరికొందరు కార్లను డిజైన్ కూడా చేయించుకుంటారు. ఇటీవల రామ్ చరణ్ కూడా అత్యంత ఖరీదైన మెర్సిడెస్ మేబాక్ జీఎల్ఎస్-600 మోడల్ కారును కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీని ఖరీదు అక్షరాలా రూ.2.43 కోట్లు (ఎక్స్ షోరూం).
మెర్సిడెస్ సంస్థ సిబ్బంది స్వయంగా ఈ అల్ట్రామోడ్రన్ ఎస్ యూవీని మెగా పవర్ స్టార్ ముందుకు తీసుకువచ్చి అందించారు. ఇక రామ్ చరణ్ తన సొంతంగా అభిరుచులకు తగ్గట్టుగా కారుకు డిజైన్ చేయించుకోవడం జరిగింది. దీంతో అసలు ధర కంటే కొంత ఎక్కువ కూడా ఖర్చయ్యిందట. మెర్సిడెస్ సంస్థ మార్పులు చేయగా ఆ బిల్లు కాస్తా రూ.4 కోట్లకు వెళ్లింది. ఇక ఈ మెర్సిడెస్ ప్రత్యేకతలు ఏంటంటే… పికప్ కోసం 48 వోల్ట్ ఈక్యూ బూస్ట్ సిస్టమ్. 4.9 సెకన్లలోనే 100 కిమీ వేగం, అత్యదిక వేగం గంటకు 250 కిలోమీటర్లు. లగ్జరీ, కంఫర్ట్ అనేది మెయిన్ హైలెట్. 4 లీటర్ బీఐ టర్బో వీ8 ఇంజిన్. 9జీ ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్. 4 ఇండివిడ్యువల్ సీట్లు.
లోపల మొత్తం నాణ్యమైన నప్పా లెదర్. మోనోటోన్ కవాన్సైట్ బ్లూ షేడ్ కలర్ లో మరింత కలర్ఫుల్ గా మారింది. డ్యూయల్ టోన్ బ్రౌన్ ఇంటీరియర్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. రిక్లైనింగ్ రియర్ సీట్లతో పాటు ఎలక్ట్రానిక్ పనోరమిక్ స్లైడింగ్ సన్ రూఫ్ మరింత కొత్త అనుబూతిని ఇస్తుంది. వెంటిలేటెడ్ మసాజ్ సీట్లు కూడా ఉన్నాయి. లైటింగ్ అడ్జస్ట్ అలాగే 12.3 అంగుళాల లేటెస్ట్ ఎంబీయూఎక్స్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్.