యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించి గత ఆరేళ్లలో విడుదలైన సినిమాలు రెండు మాత్రమే అయినా తారక్ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ (RRR) సక్సెస్ తో ఆకాశమే హద్దుగా తారక్ క్రేజ్ పెరగగా మరో రెండు కొత్త సినిమాలకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. తారక్ పుట్టినరోజున ఈ రెండు ప్రాజెక్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటన రానుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో తారక్ సోలో హీరోగా ఒక ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రకటన రానుందని తారక్ త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో హారిక హాసిని బ్యానర్ లో సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమాకు సంబంధించి ప్రకటన రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్తలను అధికారికంగా ప్రకటనలు వచ్చే వరకు నమ్మలేము.
ఎన్టీఆర్ పుట్టినరోజున తారక్ ప్రశాంత్ (Prasanth Neel) మూవీ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర (Devara) ఫస్ట్ సింగిల్ మే 20వ తేదీన విడుదల కానుందని వార్2 సినిమా నుంచి పోస్టర్ కూడా విడుదల కానుందని భోగట్టా. తారక్ పుట్టినరోజు అభిమానులకు సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని వరుస అప్ డేట్స్ తో తారక్ బర్త్ డే రోజు అభిమానులకు అంచనాలకు మించి ఉండబోతుందని సమాచారం అందుతోంది.
జూనియర్ ఎన్టీఆర్ సైతం వేగంగా సినిమాల్లో నటించి ఫ్యాన్స్ కు మరింత ఆనందాన్ని కలిగించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ వేగంగా తన సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారని భోగట్టా. తారక్ రెమ్యునరేషన్ పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.