‘కార్తికేయ 2 ‘ తో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు హీరో నిఖిల్.ఇప్పుడు నార్త్ లో అతని సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. త్వరలో ‘స్పై’ అనే మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. జూన్ 29 న ఈ మూవీ విడుదల కాబోతుంది. గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ మూవీని ‘ఈడీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. రెండో ప్రపంచ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షలాది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ధ స్పూర్తిని నింపారు సుభాష్ చంద్రబోస్. అలాంటి గొప్ప వ్యక్తి 1945లో ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయినట్లు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ అది కవరప్ స్టోరీ అని ‘స్పై’ టీజర్ లో చూపించారు.
అలాగే కొంత రివేంజ్ స్టోరీ కూడా ఉన్నట్టు ట్రైలర్ చెప్పింది. టీజర్, ట్రైలర్ .. రెండూ కూడా సినిమా పై అంచనాలను అమాంతం పెంచేశాయి అని చెప్పాలి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. అలాగే తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.
ఈ సినిమాకి (SPY Movie) ఎటువంటి కట్స్ లేకుండా యు /ఎ రేటింగ్ ను జారీ చేశారు సెన్సార్ సభ్యులు. అలాగే ‘ ఈ చిత్రం చాలా బాగుందని. విజువల్స్, కాన్సెప్ట్ చాలా బాగా కుదిరాయి అని, తప్పకుండా ఇది అందరూ గర్వపడే సినిమా అవుతుంది ‘ అని కూడా సెన్సార్ సభ్యులు ప్రశంసించినట్టు తెలుస్తుంది.