Sreeja: చిరు చిన్న కూతురు శ్రీజ పోస్ట్‌ వైరల్‌!

మనసులో మాటలు చెప్పడానికి ఎన్ని అక్షరాలున్నా సరిపోవు, ఎన్ని పదాలు కూర్చినా సరిపోవు, అయినా భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తుంటాం. అలా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ కూడా అదే పని చేసింది. తన తమ్ముడు వరుణ్‌ తేజ్‌ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. అందులో ఆమె రాసిన విషయాలు సోదరుడి మీద తన ప్రేమను తెలియజేస్తోంది. శ్రీజ భలే చెప్పింది కదా అని నెటిజన్లు అనుకుంటున్నారు.

వరుణ్‌ తేజ్‌ జనవరి 19న అంటే నిన్ననే పుట్టిన రోజు జరుపుకున్నాడు. తన వాళ్లు, తన అనుకున్న వాళ్లు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. సినిమా వాళ్లు అయితే పోస్టర్లతో విషెస్‌ చెప్పారు. అలా శ్రీజ కూడా తన ప్రేమను తెలియజేసేలా ఓ పోస్ట్‌ పెట్టింది. వరుణ్‌తేజ్‌, వైష్ణవ్‌తేజ్‌ కలసి దిగిన ఓ ఫొటోను షేర్‌ చేస్తూ తన మనసులోని భావాలను రాసుకొచ్చింది. ‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడుగ్గా ఉన్నంత మాత్రాన తెలివైన వాళ్లమని అనిపించుకోలేరు.

అందుకే నీ కోసం నేను ఉన్నాను’’ అంటూ ఆటపట్టించేలా రాసుకొచ్చింది శ్రీజ. దాంతోపాటు ‘‘నా బాల్యాం సంతోషంగా గడిచేలా చేశావు. చాలా విషయాల్లో నాకు సపోర్ట్‌గా నిలిచావు. ఎంతో ప్రేమించావు. నీ మీద నాకు మాటల్లో చెప్పలేనంత ప్రేమ ఉంది’’ అని పేర్కొంది శ్రీజ. దీంతో ఆ పోస్టు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. తమ్ముడు అంటే శ్రీజకు ఎంత ప్రేమ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దాంతో పాటు ఆ ఫొటో కూడా వైరల్‌ అవుతోంది.

ఇక శ్రీజ గురించి మరో విషయం కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆదే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాండిల్‌ నేమ్‌ మార్చడం. శ్రీజ కల్యాణ్‌ నుండి శ్రీజ కొణిదెల అంటూ ఇటీవల మార్పు చేయించుకుంది శ్రీజ. దీంతో ఎందుకిలా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు ఇటీవల కాలంలో మెగా ఫ్యామిలీ గేదరింగ్స్‌లో కళ్యాణ్‌దేవ్‌ కనిపించడం లేదు. దీంతో ఏదో జరుగుతోంది అంటూ చెవులు కొరుక్కుంటున్నారు.

1

2

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus