Sreeleela: మహేష్ – త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీ కొత్త షెడ్యూల్ లో శ్రీలీల.. ఆన్ లొకేషన్ పిక్ వైరల్!

‘ఎస్.ఎస్.ఎం.బి 28′(వర్కింగ్ టైటిల్) చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈరోజు షూట్లో మహేష్ బాబు, పూజా హెగ్డే లతో పాటు రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ , శ్రీలీల కూడా పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ ను శరవేగంగా ఫినిష్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు. ఈ ఒక్క షెడ్యూల్ కే రూ.10 కోట్లు ఖర్చవుతుందట. ఫస్ట్ షెడ్యూల్ లో కొన్ని లవ్ సీన్స్ ను, యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించాడు త్రివిక్రమ్.

ఈ మూవీలో బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ కూడా కీలక పాత్ర పోషిస్తుందట. కానీ ఆమె ఈ ప్రాజెక్టులో ఉన్నట్టు చిత్ర బృందం ఎటువంటి ప్రకటన చేయలేదు. త్వరలోనే ‘ఎస్.ఎస్.ఎం.బి 28’ అప్డేట్ గా ఆ విషయాన్ని తెలియజేయనున్నారని సమాచారం.

ఈ ఏడాది ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ఇక ఈరోజు జరిగిన షూటింగ్ స్పాట్ నుండి శ్రీలీల పిక్ ఒకటి బయటకు వచ్చింది. రెడ్ కలర్ డ్రెస్ లో చాలా గ్లామర్ గా కనిపిస్తుంది.

‘పెళ్ళిసందD’ ‘ధమాకా’ వంటి సూపర్ హిట్లు కొట్టి స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న ఈ అమ్మడికి పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు త్రివిక్రమ్. అయితే త్రివిక్రమ్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన భామలకు తర్వాత కలిసి రాలేదు. ఆ సెంటిమెంట్ ను శ్రీలీల మారుస్తుందో లేదో తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆమె ఫోటో వైరల్ అవుతుంది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus