టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీలీల ఈ స్థాయికి చేరుకోవడం కోసం ఎంతో కష్టపడ్డారు. చదువుకునే సమయంలో డ్యాన్స్ ప్రదర్శనలు ఇచ్చేదానినని అయితే ఆ సమయంలో సినిమాల గురించి ఆలోచన లేదని ఆమె చెప్పుకొచ్చారు. డాక్టర్ గా సేవ చేయాలని బలంగా ఉండేదని శ్రీలీల వెల్లడించారు. ఆ సంకల్పంతోనే సినిమాల్లోకి వచ్చానని శ్రీలీల పేర్కొన్నారు. సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతున్నా లక్ష్యాన్ని మాత్రం వదల్లేదని ఆమె కామెంట్లు చేశారు.
ఒకే ఒక్క ఫోటో నా లైఫ్ ను మార్చేసిందని నా అడుగుల్ని మరో దారిలోకి మళ్లించిందని శ్రీలీల పేర్కొన్నారు. అది తలుచుకుంటే నాకు కూడా విచిత్రంగా ఉంటుందని ఆమె వెల్లడించారు. హలో గురు ప్రేమకోసమే సినిమాలో నటించే ఛాన్స్ నాకు వచ్చినా వేర్వేరు కారణాల వల్ల రిజక్ట్ చేశానని ఆమె కామెంట్లు చేశారు. చదువు ఆపనని తాతయ్యకు మాటిచ్చి సినిమాల్లో కొనసాగుతున్నానని శ్రీలీల అన్నారు. మా అమ్మమ్మ వాళ్లది ఒంగోలు అని ఆమె తెలిపారు.
బాల్యంలో చదువు, డ్యాన్స్ తప్ప మరో ప్రపంచం లేకుండా నేను పెరిగానని ఆమె చెప్పుకొచ్చారు. డాన్స్ మొదట్లో కష్టంగా అనిపించినా తర్వాత రోజుల్లో ఇష్టం పెరిగిందని శ్రీలీల అన్నారు. ఎంబీబీఎస్ చేసిన పదేళ్లకు అయినా పీజీ పూర్తి చేసే సౌలభ్యం ఉందని ఆమె తెలిపారు. పదో తరగతిలో ఉండగానే కిస్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని కిస్, భరాటే సినిమాల ద్వారా మంచి పేరు రావడంతో రాఘవేంద్రరావు గారు పెళ్లిసందడి సినిమాలో ఛాన్స్ ఇచ్చారని శ్రీలీల చెప్పుకొచ్చారు.
మెడికల్ ఎంట్రన్స్ కు చదువుతున్న సమయంలో ధమాకా సినిమాలో ఆఫర్ వచ్చిందని ఆమె తెలిపారు. కాలేజ్ యాజమాన్యం, అమ్మ ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ చదువుతున్నానని శ్రీలీల పేర్కొన్నారు. శ్రీలీలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.