Sreeleela: శ్రీలీల తెలివైన నిర్ణయం.. కానీ..!
- May 29, 2025 / 01:46 PM ISTByPhani Kumar
‘పెళ్ళిసందD’ ‘ధమాకా’ (Dhamaka) వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ అవతారం ఎత్తింది శ్రీలీల(Sreeleela). ఆ తర్వాత వరుస ఆఫర్లతో టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ అయిపోయింది. ఈ క్రమంలో ఆమెకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), మహేష్ బాబు (Mahesh Babu) వంటి స్టార్ల సరసన నటించే అవకాశాలు కూడా లభించాయి. అయితే ఊహించని విధంగా శ్రీలీల చేసిన ఆ సినిమాల్లో చాలా వరకు ఫ్లాప్ అయ్యాయి. రామ్ తో (Ram) చేసిన ‘స్కంద'(Skanda) , వైష్ణవ్ తేజ్ (Panja Vaisshnav Tej) తో చేసిన ‘ఆదికేశవ'(Aadikeshava), నితిన్ (Nithiin) తో చేసిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్'(Extra Ordinary Man) ‘రాబిన్ హుడ్’ (Robinhood) వంటి సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లు అయ్యాయి.
Sreeleela

మహేష్ తో చేసిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) ఓకే అనిపించినా ఆమెకు ఎటువంటి క్రెడిట్ లభించింది లేదు. దీంతో ఆమెకు తెలుగులో ఛాన్సులు రావేమో అని అంతా అనుకున్నారు. కానీ ప్రస్తుతం రవితేజకి (Ravi Teja) జోడీగా ‘మాస్ జాతర’ (Mass Jathara) అఖిల్ కి(Akhil Akkineni) జోడీగా ‘లెనిన్’ (Lenin) వంటి సినిమాల్లో నటిస్తోంది.అలాగే తమిళ్ లో శివకార్తికేయన్ (Sivakarthikeyan) ‘పరాశక్తి’ లో (Parasakthi) నటిస్తుంది. ఇవి కనుక హిట్ అయితే మళ్ళీ ఆమె ఫామ్లోకి వచ్చినట్టే. మరోపక్క ఆమె బాలీవుడ్లో కూడా నటిస్తుంది.

ఇదిలా ఉండగా.. శ్రీలీల పారితోషికం లెక్కలు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఒకానొక టైంలో ఆమె పారితోషికం రూ.3 కోట్ల వరకు వెళ్ళింది. కాకపోతే ఆమెకు భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse)వంటి భామల నుండి గట్టి పోటీ ఎదురవుతుంది. అలాగే మరోపక్క వరుస ప్లాపులు ఉన్నాయి. దీంతో ఆమె పారితోషికం తగ్గించుకుంటూ వచ్చింది.

‘రాబిన్ హుడ్’ ‘పుష్ప 2′(ఒక సాంగ్)(Pushpa 2) .. ఈ రెండిటికీ కలిపి రూ.3 కోట్లు అందుకుంది. బాలీవుడ్ ప్రాజెక్టు కోసం రూ.1.75 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు టాలీవుడ్లో మరో సినిమా కోసం అప్రోచ్ అయితే.. రూ.1.30 కోట్లు చెప్పిందట. అంటే మరింతగా ఆమె తగ్గించుకున్నట్టే అని చెప్పాలి.
















