Sreemukhi: విజయ్ దేవరకొండకు సెటైర్ వేసిన శ్రీముఖి..వీడియో వైరల్!

పెళ్లిపై విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్వ‌ర‌లోనే తాను పెళ్లిపీట‌లెక్క‌బోతున్న‌ట్లు తెలిపాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన ఖుషి సినిమా సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా నీతోనే డాన్స్ ఫైన‌ల్ ఎపిసోడ్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ చీఫ్ గెస్ట్ గా హాజ‌ర‌య్యాడు. ఈ ఫైన‌ల్‌లో పెళ్లి గురించి శ్రీముఖి అడిగిన ప్ర‌శ్న‌కు విజ‌య్ ఇచ్చిన ఆన్స‌ర్ వైర‌ల్‌గా మారింది. పెళ్లి చేసుకోమ‌ని ఇంట్లో వాళ్లు ఒత్తిడి తీసుకొస్తున్నార‌ని తెలిపాడు.

పెళ్లి విష‌యంలో త‌న‌కు కొన్ని రిక్వైర్స్‌మెంట్స్ ఉన్నాయ‌ని విజ‌య్ అన్నాడు. మ‌న‌వ‌ళ్లు కావాల‌ని అమ్మానాన్న అడుగుతున్నార‌ని విజ‌య్ అన‌గానే.. త‌ల్లిదండ్రుల కోరుకున్న సంతోషాన్ని వారికి అందివ్వ‌మ‌ని విజ‌య్‌కి సీనియ‌ర్ హీరోయిన్ రాధ స‌ల‌హా ఇచ్చింది. పెళ్లిలో నాకు హ్యాపీనెస్ ఉండ‌ద‌నిపిస్తోంది అందుకే వాళ్ల‌నే మ‌ళ్లీ పెళ్లి చేసుకోమ‌మ‌ని చెబుతున్నానంటూ రాధకు ఫ‌న్నీగా రిప్లై ఇచ్చాడు విజ‌య్. ఆ త‌ర్వాత పెళ్లి గురించి అంద‌రితో మాట్లాడుతున్నాన‌ని విజ‌య్ అన‌గానే ఒకేసారి అంద‌రిని పెళ్లి చేసుకోలేం క‌దా అంటూ శ్రీముఖి (Sreemukhi) వేసిన సెటైర్ నీతోనే డ్యాన్స్ ప్రోమోలో హైలైట్‌గా నిలుస్తోంది.

పెళ్లి గురించి న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, అమ‌ర్‌దీప్‌ల‌కు, విజ‌య్‌కి మ‌ధ్య జ‌రిగిన క‌న్వ‌ర్జేష‌న్స్ కూడా ప్రోమోలో న‌వ్వులు పూయిస్తాయి. ప్ర‌స్తుతం నీతో డ్యాన్స్ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఖుషి సినిమా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో సెప్టెంబ‌ర్ 1న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విజ‌య్‌కి జోడీగా స‌మంత హీరోయిన్‌గా న‌టిస్తోంది.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus