Bigg Boss 5 Telugu: టాస్క్ లో ఇద్దరూ కావాలనే అలా చేశారా..?

బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కోసం మరోసారి హౌస్ మేట్స్ మద్యలో వార్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక్కడ రెండు టీమ్స్ గా విడిపోయిన హౌస్ మేట్స్ హీరోస్ విలన్స్ అంటూ తలబడ్డారు. ఇందులో భాగంగా గేమ్ స్టార్ట్ అవ్వగానే కాజల్ థండర్ లాకర్ తాళాలని ఓపెన్ చేసింది. దీన్ని స్టోర్ రూమ్ లో పెట్టే ప్రయత్నంలో పింకీ ఇంకా విశ్వ ఇద్దరూ ఆర్గ్యూ చేసుకున్నారు. ఇక ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవ్వగానే విలన్స్ పేరు వచ్చింది. విలన్స్ అందరూ కలిసి హీరోస్ లో ఉన్న శ్రీరామ్ చంద్రని సెలక్ట్ చేసుకున్నారు.

శ్రీరామ్ తో ఎన్నో విన్యాసాలు చేయించారు. జ్యూస్ ఇచ్చి శీర్షాసనం వేయమన్నారు. ఆ తర్వాత తలపై పెయింట్ పూసుకోమన్నారు. రకరకాల జ్యూస్ లని కలిపి ఇచ్చాడు. అయినా కూడా శ్రీరామ్ ఐ క్విట్ అని అనలేదు. ఈలోగా జెస్సీ ట్రిమ్మర్ తీస్కుని వచ్చి హెయిర్ కట్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బిగ్ బాస్ బజర్ మోగించేసరికి ఊపిరి పీల్చుకున్నాడు శ్రీరామ్ చంద్ర. ఇచ్చిన ఛాలెంజస్ అన్నింటిని పంతంతో శ్రీరామ్ చంద్ర ఫినిష్ చేశాడు. దీంతో హీరోల టీమ్ కి ఒక పాయింట్ వచ్చింది. ఇక నెక్ట్స్ రౌండ్ లో పింకీ తనని నెట్టేసిందని సిరి కంప్లైట్ చేసింది.

అందరూ చుట్టూ ఉంటే తోయకుండా ఎలా ఉంటామ్ అంటూ పింకీ వాదించింది. ఇక షణ్ముక్ ఇద్దరిదీ తప్పేనంటూ తీర్పు ఇచ్చాడు. నెక్ట్స్ రౌండ్ లో హీరోలు వినల్స్ టీమ్ లో ఉన్న రవిని సెలక్ట్ చేస్కున్నారు. రవి బట్టలన్నీ తీస్కుని వచ్చి పేడ పూస్కోమని చెప్పారు. కానీ, షణ్ముక్ ఒంటిమీద ఉన్నవాటికి పూస్కోమని ఛాయిస్ ఇచ్చాడు. దీంతో రవి తన బట్టలకి పేడ పూసుకున్నాడు. ఇచ్చిన విచిత్రమైన జ్యూస్ లు తాగాడు. తర్వాత డంబుల్స్ ఇచ్చి స్క్వాడ్స్ చేయమన్నపుడు అనీమాస్టర్ రవికి ఉన్న బ్యాక్ పైయిన్ గురించి గుర్తు చేసింది.

అయినా కూడా రవి కొన్ని స్క్వాడ్స్ చేశాడు. ఎక్కడా తగ్గకుండా మొండితనంతో ఇచ్చిన ఛాలెంజస్ అన్నీ చేసి గెలిచాడు రవి. దీంతో విలన్స్ టీమ్ కి ఒక పాయింట్ వచ్చింది. ఇక శ్రీరామ్ అండ్ రవి ఇద్దరూ కూడా నామినేషన్స్ లో ఉన్నందుకు ఇలా చేశారా అని అనిపించింది. అంతేకాదు, వారి టీమ్స్ ని గెలిపించేందుకు మొండితనంతో టాస్క్ ఆడారు ఇద్దరూ. అదీ విషయం.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus