Prabhas: ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టినా, ప్రభాస్‌తో మూవీ చేయలేకపోయిన ఆ డైరెక్టర్ ఎవరంటే..?

సినిమా ఇండస్ట్రీలో ముందుగా ఒక నిర్మాత, దర్శకుడ కథ ఫైనల్ చేసుకుని.. దానికి తగ్గ హీరో కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు.. అలా కొంతమంది హీరోలను ఆప్షన్‌గా పెట్టుకుని.. కథానాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు.. కాంబినేషన్ సెట్ అయ్యేవరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.. కొన్ని సార్లు సినిమా అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఆగిపోయిన సంఘటనలు చాలానే జరిగాయి.. అలా ఫస్ట్ ఫిలింతో డైరెక్టర్‌గా హిట్ కొట్టి, రెండో చిత్రం విషయంలో బాగా లేట్ చేసిన డైరెక్టర్ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం..

శ్రీవాస్.. గోపిచంద్, అనుష్క హీరో హీరోయిన్లుగా ‘లక్ష్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు.. జగపతి బాబు, కళ్యాణి హీరో అన్న వదినలుగా చేశారు.. ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ అనిపించుకున్నాడు.. తర్వాత నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లో అవకాశమిచ్చాడు.. హీరోగా ప్రభాస్ అయితే బాగుంటుంది అనుకున్నారు.. అప్పటికే డార్లింగ్‌తో ‘మున్నా’ తీశారు.. దర్శకుడు, నిర్మాత చేత ‘శ్రీరామనవమి’ అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి..

పండుగ పేరుతో ఉన్న సాఫ్ట్ టైటిల్ కాబట్టి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాలని ప్లాన్ చేశారు.. డైరెక్టర్ ఒకటి, రెండు వెర్షన్లు రాసుకున్నాడు కానీ కథ అనుకున్నంతగా రావడం లేదు.. దీంతో కొన్నాళ్లు స్టోరీ డిస్కషన్స్ చేసిన తర్వాత ఎక్కడో తేడా కొడుతుందనిపించి ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేశారు.. ఫ్రెష్‌గా మళ్లీ కథ రాసే పనిలో పడ్డారు..

అలా తెలియకుండానే ‘లక్ష్యం’ తర్వాత రెండో సినిమా రిలీజ్ అవడానికి దగ్గర దగ్గర మూడేళ్ల సమయం పట్టింది.. అదే, రామ్ పోతినేని, బిందు మాధవి, ప్రియా ఆనంద్ ప్రధాన పాత్రల్లో తీసిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’.. లవ్, ఫ్యామిలీ, మాఫియా లాంటివి యాడ్ చేసి తీశారు కానీ అనుకున్నంతగా కనెక్ట్ కాలేదు.. యావరేజ్, ఫ్లాప్‌కి మధ్యలో ఆగిపోయింది.. అలా ప్రభాస్ ఇమేజ్‌కి సరిపడే కథ సెట్ కాకపోవడంతో ‘శ్రీరామనవమి’ మిస్ అయ్యింది..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus