Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2’ అయినా సక్సెస్ ఇస్తుందా?
- August 27, 2024 / 09:45 AM ISTByFilmy Focus
కీరవాణి (M. M. Keeravani) తనయుడు శ్రీ సింహా కోడూరి (Sri Simha Koduri) అందరికీ సుపరిచితమే. రాజమౌళి (S. S. Rajamouli) తెరకెక్కించిన ‘యమదొంగ’ (Yamadonga) ‘మర్యాదరామన్న’ (Maryada Ramanna) వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అతను ‘ఈగ’ (Eega) సినిమాలో సమంతకి (Samantha) ఫ్రెండ్ రోల్ చేశాడు. ఆ తర్వాత సుకుమార్ (Sukumar) తెరకెక్కించిన ‘రంగస్థలం’ (Rangsthalam) చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు సింహా. ఇక అటు తర్వాత.. అంటే 2019 లో ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
Mathu Vadalara 2

సింహాకి హీరోగా మంచి గుర్తింపు లభించింది. కానీ ఆ తర్వాత అతను చేసిన ‘తెల్లవారితే గురువారం’ ‘దొంగలున్నారు జాగ్రత్త’ (Dongalunnaru Jagratha) ‘భాగ్ సాలే’ (Bhaag Saale) ‘ఉస్తాద్’ (Ustaad) వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో తొందరగానే ఫేడౌట్ అయిపోయే పరిస్థితి సింహాకి వచ్చింది. ఇప్పుడు అతను కచ్చితంగా ఓ హిట్టు కొట్టాలి. దీని కోసం తన హిట్ సెంటిమెంట్ నే వాడుకుంటున్నాడు. 2019 లో వచ్చిన ‘మత్తు వదలరా’ కి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ రూపొందుతుంది.

రితేష్ రానానే ఈ సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నాడు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఇందులో కూడా సత్య (Satya Akkala) పాత్ర కీలకంగా ఉంటుందని.. అతని కామెడీ హైలెట్ కానుందని వినికిడి. ఒకవేళ అది వర్కౌటైనా సింహా కోడూరి గట్టెక్కేస్తాడు. లేదు అంటే.. అతని కెరీర్లో గ్యాప్ తీసుకోవాల్సి రావచ్చు. సెప్టెంబర్ 13న ఈ విషయం పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేస్తుంది.












