మెగాస్టార్ చిరంజీవి హీరోగా రవితేజ కీలక పాత్రలో బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. జస్ట్ ఓకే అనిపించింది. రవితేజ పాత్రకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. అది కూడా ఓకే అనిపించింది. ‘బాస్ పార్టీ’ అంటూ మొదటి పాట రిలీజ్ అయ్యింది. అది ఓకే అనిపించింది కానీ లిరిక్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి అనే చెప్పాలి. తాజాగా రెండో పాటను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ అంటూ సాగే ఈ పాట ట్యూన్ పరంగా బాగానే అనిపించింది. పాట పిక్చరైజేషన్ కూడా బాగానే ఉన్న ఫీలింగ్ కలిగిస్తుంది. చిరు, శృతి హాసన్ ల లుక్స్ కూడా బాగానే అనిపిస్తున్నాయి. కానీ ఈసారి కూడా దేవి శ్రీ ప్రసాద్ లిరిక్స్ మైనస్ అనే ఫీలింగ్ ను కలిగించింది. ఈ పాటను చార్ట్ బస్టర్ అవ్వకుండా చేసేది మాత్రం ఆ లిరిక్స్ అవుతాయి అనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో మొత్తం 5 పాటలు ఉంటాయని వినికిడి.
విడుదలైన రెండు పాటలు జస్ట్ ఓకే అనిపించాయి కానీ ఫ్యాన్స్ లో ఊపుని తీసుకురాలేకపోయాయి. మరి మిగిలిన ఆ 3 పాటలు ఎలా ఉంటాయో..! 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ప్రమోషన్స్ నీరసంగానే సాగుతున్నాయి. అనుకున్న స్థాయిలో బజ్ ఇంకా క్రియేట్ కాలేదు. మరోపక్క ఈ చిత్రానికి పోటీగా రిలీజ్ కాబోతున్న ‘వీరసింహారెడ్డి’ ప్రమోషనల్ కంటెంట్ మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇటీవల రిలీజ్ అయిన ‘సుగుణ సుందరి’ పాట చార్ట్ బస్టర్ అయ్యింది. తమన్ అందించిన మ్యూజిక్ ఆ చిత్రానికి మరింత మైలేజ్ ను అందిస్తుండగా.. ‘వాల్తేరు వీరయ్య’ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మైనస్ అయ్యేలా ఉంది అంటూ అభిమానులు భయపడుతున్నట్లు తెలుస్తుంది. మరి ‘వాల్తేరు వీరయ్య’ నుండి రాబోయే పాటలు ఏమైనా సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తాయేమో చూడాలి.