సుధీర్ బాబు హీరోగా ఆనంది హీరోయిన్ గా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ’70.ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగష్ట్ 27న విడుదలయ్యింది.సినిమాకి కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ముందు నుండీ ఉన్న హైప్ కారణంగా మొదటి రోజు మాత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. కానీ రెండో రోజు నుండీ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.సండేతో పాటు నిన్న కృష్ణాష్టమి సెలవుని కూడా ఈ చిత్రం క్యాష్ చేసుకోలేకపోయింది.
ఈ చిత్రం 4 రోజుల కలెక్షన్ల వివరాలను గమనిస్తే :
నైజాం
1.22 cr
సీడెడ్
0.57 cr
ఉత్తరాంధ్ర
0.43 cr
ఈస్ట్
0.32 cr
వెస్ట్
0.17 cr
గుంటూరు
0.35 cr
కృష్ణా
0.19 cr
నెల్లూరు
0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
3.35 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.08 Cr
ఓవర్సీస్
0.18 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.61 cr
‘శ్రీదేవి సోడా సెంటర్’ కు రూ.7.98 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కావడానికి ఈ చిత్రం రూ.8.2 కోట్ల షేర్ ను రాబట్టాలి.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.61 కోట్ల షేర్ ను రాబట్టింది.అంటే బ్రేక్ ఈవెన్ కు మరో రూ.4.59 కోట్ల షేర్ ను రాబట్టాలన్న మాట. చూస్తుంటే అది అసాధ్యమనిపిస్తుంది.