Srikanth Addala: అఖండ టీమ్ తో శ్రీకాంత్ అడ్డాల!

కొత్త బంగారు లోకం సినిమా ద్వారా దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శ్రీకాంత్ అడ్డాల. ఆ తర్వాత ముకుంద సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక చాలా కాలం నుంచి ఎవరూ చేయని విధంగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమాను కూడా తెరపైకి తీసుకువచ్చాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ లాంటి ఇద్దరు అగ్ర హీరోలతో శ్రీకాంత్ సింపుల్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే మంచి విజయాన్ని అందుకున్నాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఆ నమ్మకంతోనే మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఆఫర్ ఇచ్చాడు. కానీ ఆ దెబ్బతో శ్రీకాంత్ చాలాకాలం పాటు మరో అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూడాల్సి వచ్చింది. మొత్తానికి వెంకటేష్ సురేష్ బాబు ఆ దర్శకుడి పై నమ్మకంతో అసురన్ రీమేక్ చేసే అవకాశం ఇచ్చారు. నారప్ప సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే.

కానీ ఆ సినిమాలో పెద్దగా మార్పులు చేయకుండా ఉన్నది ఉన్నట్లుగానే దర్శకుడు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఇక శ్రీకాంత్ ప్రస్తుతం మంచి ప్రాజెక్టులు సెట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.ఎవరూ చూపించని విధంగా ఒక ఎమోషనల్ పాయింట్ ను కూడా టచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి తో చర్చలు జరిపినట్లు సమాచారం. మిర్యాల రవీందర్ రెడ్డి బంధువులలోని ఒక యువకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ డిఫరెంట్ ఎమోషనల్ లవ్ స్టోరీ నీ తెరపైకి తీసుకు రాబోతున్నట్లు టాక్.

శ్రీకాంత్ అడ్డాల ఈ సారి ఎలాగైనా తనదైన శైలిలో మంచి బాక్సాఫీస్ అందుకోవాలని చూస్తున్నాడు. గతంలో మెగాస్టార్ చిరంజీవి కోసం కూడా ఒక పవర్ఫుల్ ప్రాజెక్టును సిద్ధం చేసినట్లుగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఒక చిన్న సినిమాతో సక్సెస్ అందుకొని శ్రీకాంత్ ఆ తర్వాత ఏకంగా మెగా స్టార్ లాంటి హీరో తో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus