స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన సినిమాల్లో హీరోలను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తారో విలన్లను కూడా అంతే పవర్ ఫుల్ గా చూపిస్తారనే సంగతి తెలిసిందే. లెజెండ్ సినిమాతో జగపతిబాబు కెరీర్ ను మలుపు తిప్పిన బోయపాటి శ్రీను అఖండ సినిమాతో శ్రీకాంత్ కెరీర్ నుకూడా మలుపు తిప్పుతాడని శ్రీకాంత్ అభిమానులు భావిస్తున్నారు. తాజాగా రిలీజైన ట్రైలర్ లో భయంకరమైన లుక్ లో కనిపించి శ్రీకాంత్ అభిమానులు ఆశ్చర్యపోయేలా చేశారు.
ఫ్యామిలీ సినిమాల హీరోగా ముద్ర వేసుకున్న శ్రీకాంత్ తన శైలికి భిన్నంగా విలన్ పాత్రలపై దృష్టి పెట్టారు. అఖండ సినిమాతో శ్రీకాంత్ కు బ్రేక్ వస్తే మరికొన్ని సినిమాలలో శ్రీకాంత్ కు విలన్ ఆఫర్లు దక్కే అవకాశం ఉంది. మరికొన్ని రోజుల్లో అఖండ రిజల్ట్ తెలిసే అవకాశం ఉండగా శ్రీకాంత్ పాత్రకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. శ్రీకాంత్ మాత్రం ఈ సినిమా తన జాతకాన్ని మారుస్తుందని భావిస్తున్నారు.
డిసెంబర్ 2వ తేదీనే అఖండ మూవీ రిలీజ్ కానుండగా ఈ సినిమా రిలీజ్ వల్ల గని మూవీ డిసెంబర్ 24వ తేదీకి వాయిదా పడింది. పుష్ప పార్ట్1 రిలీజైన వారం రోజులకే శ్యామ్ సింగరాయ్, గని రిలీజ్ కానుండటం గమనార్హం. బాలకృష్ణ, బోయపాటి శ్రీను ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తామని భావిస్తున్నారు. రొటీన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నా మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.
Most Recommended Video
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!