కేజీఎఫ్’తో జాతీయస్థాయిలో పేరు తెచ్చుకుంది శ్రీనిధి శెట్టి. తాజాగా కాస్త జోరు పెంచి టాలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్ధమైందీ కన్నడ భామ. క్రేజీ హీరో సిద్దూ జొన్నలగడ్డ తో ఆడిపాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ అందాలరాశి చెబుతున్న కబుర్లివి. కాలేజీ రోజుల్లో నేను ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఫొటోలను చూసి తెగ సంబరపడిపోయేవారు. మోడలింగ్‌పై ఆసక్తి ఉందని మొదటగా నాన్నకు చెప్పినప్పుడు నాకన్నా ఎక్కువ ఉత్సాహం చూపారు. మోడలింగ్ అంటే కొత్త దుస్తులు ధరించాల్సి వస్తుందని నేను అడగకుండానే షాపింగ్ కోసం డబ్బులు పంపించేవారు.
అలా అమ్మలేని లోటు తెలియకుండా నన్ను పెంచారు. నేను చాలా వేగంగా మాట్లాడుతా. దానివల్ల కొన్ని కొన్ని పదాలు మింగేస్తుంటా. ఒకప్పుడు కొన్ని పదాలు తప్పుగా ఉచ్ఛరించేదాన్ని. దాంతో చాలామంది ఎగతాళి చేసేవారు. మోడలింగ్ కోసం ముంబాయిలో అడుగుపెట్టాక, తోటివారు విమర్శించడం మొదలెట్టారు. అందుకే ఛాలెంజ్‌గా తీసుకుని నా ఉచ్ఛారణని మెరుగుపరుచుకున్నా. ఆ క్షణం నుంచి పొగడ్తలని, విమర్శలని సమానంగా స్వీకరించడం మొదలెట్టా.
నేను అభిమానించే కథానాయకుల్లో యశ్ ఒకరు. కేజీఎఫ్‌లో ఆయనే హీరో అని తెలియగానే ఎగిరి గంతేశా. ఆయనతో ఎప్పుడెప్పుడు స్ర్కీన్ షేర్ చేసుకుంటానా అని ఎంతో ఎదురుచూశా. తీరా ఆయన్ని కలవగానే నోట్లో నుంచి మాట రాలేదు. ఖాళీ సమయం దొరికితే సెట్‌లో అందరం సరదాగా క్రికెట్ ఆడేవాళ్లం. యశ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. జెంటిల్‌మ్యాన్. ఆయన జీవితం నాలాంటి వాళ్లకి స్ఫూర్తిదాయకం. నేను కాలేజీ టాపర్‌ని. చదువు పూర్తవగానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది.
అందుకే వీకెండ్స్‌లో మోడలింగ్, ఫ్యాషన్ షోలలో పాల్గొనేదాన్ని. రెండూ మేనేజ్ చేయడం కష్టంగా మారి, ఉద్యోగానికి గుడ్ బై చెప్పి, మోడలింగ్‌పై దృష్టిసారించా. ‘మిస్ కర్ణాటక’, ‘మిస్ బ్యూటిఫుల్ స్మైల్’ వంటి పోటీల్లో గెలిచా. తర్వాత వరుసగా అందాల పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకున్నా. ‘మిస్ సుప్రానేషనల్’ టైటిల్ సాధించాక ఒక్కసారిగా నా పేరు మార్మోగిపోయింది. నా ఫొటోలను చూసిన ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ నన్ను ఆడిషన్‌కి పిలిచారు. నా (Srinidhi Shetty) నటన నచ్చి వెంటనే ఓకే చేశారని చెప్పింది.