SSMB28: మహేష్ – త్రివిక్రమ్ ల సినిమాకి ఝలక్..!

  • April 3, 2023 / 12:20 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో నత్త నడక మాదిరి సాగిన ఈ చిత్రం షూటింగ్.. ఇప్పుడు స్పీడ్ అందుకుంది. అప్పుడే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇది పాన్ ఇండియా సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది.

కానీ అందులో నిజం లేదు అని మరి కొంతమంది అంటున్నారు.చిత్ర బృందం మాత్రం ఈ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ నటిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్ కూడా నటిస్తున్నట్టు టాక్ నడుస్తుంది. రమ్యకృష్ణ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అధికారిక ప్రకటన రాకుండా ఏది కూడా కన్ఫర్మ్ అని చెప్పలేం. అయితే ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం..

ఇది పాన్ ఇండియా మూవీ అయితే కాదని.. కానీ తెలుగుతో పాటు హిందీ,మలయాళంలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. అది కూడా చిత్ర బృందం అనౌన్స్ చేసినట్టు 2024 జనవరి 13కి కాకపోవచ్చని అంటున్నారు. మరోపక్క ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను ఎక్కువ రేటు పెట్టి నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేటుకి కొనుగోలు చేసినట్లు టాక్ వినిపించింది.

అయితే వాళ్ళు ఈ చిత్రాన్ని (SSMB28) హిందీలో రిలీజ్ చేయకూడదు అనే కండిషన్ కూడా పెట్టారట. ఎందుకంటే డిజిటల్ రైట్స్ లో హిందీ వెర్షన్ కూడా ఉన్నట్లు టాక్. అలాంటప్పుడు ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తే వాళ్ళతో ప్రాబ్లమ్ రావచ్చు. అందుకే నెట్ ఫ్లిక్స్ ఇచ్చిన ఆఫర్ ను కూడా హోల్డ్ లో పెట్టినట్టు వినికిడి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus