మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దిగ్గజ నటుల జాబితా తీస్తే అందులో చంద్ర మోహన్ గారి పేరు ముందు వరుస లో ఉంటుంది. ఒకప్పుడు ఈయన కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్ హీరోలతో సరిసమానమైన ఇమేజి ఉన్న హీరోనే. అలా హీరో గా కొంతకాలం కొనసాగి 175 చిత్రాలు చేసాడు. అనంతరం వరుస ఫ్లాప్స్ రావడం తో చంద్రమోహన్ కి హీరో రోల్స్ ఆఫర్ చేసే దర్శక నిర్మాతలు కరువు అయ్యారు.
అప్పుడు సరైన సమయం లో ఆయన క్యారక్టర్ ఆర్టిస్టుగా మారేందుకు సిద్ధపడ్డాడు. ఏకంగా 750 కి పైగా సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించి సెన్సేషన్ సృష్టించాడు. అయితే 2017 వ సంవత్సరం నుండి సినిమాలకు దూరం గా ఉంటూ వస్తున్న ఆయన నిన్న ఉదయం తుది శ్వాసని విడిచి తిరిగిరాని లోకాలకు పయనం అవ్వడం యావత్తు సినీ లోకాన్ని శోకసంద్రం లోకి నెట్టేసింది.
ఈ సందర్భంగా (Chandra Mohan) చంద్ర మోహన్ కి సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియా లో బయటపడ్డాయి. ఆయన ఎంత డెడికేషన్ ఉన్న నటుడు అనే దానికి ఒక ఉదాహరణ బయటకి వచ్చింది. మనసంతా నువ్వే సినిమా లో చంద్రమోహన్ ఉదయ్ కిరణ్ కి తండ్రిగా నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చేస్తున్న సమయం ల్లో చంద్ర మోహన్ గారి తల్లి చనిపోయారు.
ఈ విషయం షూటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్న చంద్ర మోహన్ కుప్పకూలిపోయాడు. కానీ ఆయన నిర్మాత బాగోగులు ని దృష్టిలో పెట్టుకొని షూటింగ్ నుండి వెంటనే వెళ్లిపోలేదు. బాధని దిగమింగుకొని ఆ షాట్స్ ని పూర్తి చేసి వెళ్ళాడు. ఇది వృత్తి పట్ల ఆయనకీ ఉన్న డెడికేషన్ ఎలాంటిది అనేది చెప్పకనే చెప్తుంది. ఇలాంటి డేడికేషన్ ఉన్న నటులు ఇండస్ట్రీ లో దొరకడం చాలా అరుదు, అలాంటి మనిషి ఇక మన మధ్య లేడు అనే వార్తని జీర్ణించుకోవడానికి కష్టం గా ఉంది.