వరుస ప్రమాదాలు, మరణాలు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. 2023 ఏడాదిలో 3 నెలలు గడువకముందే కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం, తారక రత్న, మలయాళీ యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్, టాలీవుడ్ కెమెరా మెన్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సతీష్ కౌశిక్, నటి మాధురి దీక్షిత్ తల్లి, ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కండేయ, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సమీర్ ఖాఖర్ కన్నుమూశారు..
రీసెంట్‌గా మరో పాపులర్ యాక్టర్‌ని కోల్పోయింది ఫిలిం ఇండస్ట్రీ.. ‘జాన్ విక్’ నటుడు లాన్స్ రెడ్డిక్ కన్నుమూశారు.. ఆయన వయసు 60 సంవత్సరాలు.. రెడ్డిక్ మరణ వార్తతో హాలీవుడ్‌లో విషాదం నెలకొంది.. టీవీ సిరీస్‌తో పాటు ‘జాన్ విక్’ ఫ్రాంచైజీతో గుర్తింపు తెచ్చుకున్న రెడ్డిక్.. శుక్రవారం (మార్చి 17) ఉదయం అనూహ్యంగా మృతి చెందారు.. రెడ్దిక్ మరణాన్ని అతని ప్రచారకర్త మియా హాన్సెన్ ధృవీకరించారు..
అయితే ఆయన ఎక్కడ మరణించారు, ఎలా మరించారన్న దానిపై స్పష్టత లేదు.. సహజ మరణం పొందినట్లు కథనాలు వస్తున్నాయి.. రెడ్దిక్ ఎక్కువ భాగం ‘ఇన్వెస్టిగేషన్ యూనిట్’ క్యారెక్టర్లలో కనిపించారు.. అమెజాన్ వెబ్ సిరీస్ ‘బాష్’ లో కూడా నటించారు.. 1996లో వచ్చిన ‘న్యూయార్క్ అండర్‌కవర్’, ‘ది వెస్ట్ వింగ్’ లాంటి టీవీ సిరీస్ ద్వారా రెడ్దిక్ నటుడిగా ఎంట్రీ ఇచ్చారాయన..