సినీ పరిశ్రమలో మరో విషాదం.. అనుమానాస్పద రీతిలో ప్రముఖ నటుడు మృతి!

వరుస ప్రమాదాలు, మరణాలు సినీ పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.. 2023 ఏడాదిలో 3 నెలలు గడువకముందే కె. విశ్వనాథ్, జమున, వాణీ జయరాం, తారక రత్న, మలయాళీ యంగ్ డైరెక్టర్ జోసెఫ్ మను జేమ్స్, టాలీవుడ్ కెమెరా మెన్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సతీష్ కౌశిక్, నటి మాధురి దీక్షిత్ తల్లి, ప్రముఖ మరాఠీ నటి భాగ్యశ్రీ మోటే సోదరి మధు మార్కండేయ, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సమీర్ ఖాఖర్, హాలీవుడ్ నటుడు ‘జాన్ విక్’ నటుడు లాన్స్ రెడ్డిక్ కన్నుమూశారు..

తాజాగా మరో ప్రముఖ నటుడు మృతి చెందారనే వార్తతో పరిశ్రమ వర్గాలు ఉలిక్కి పడ్డాయి.. పాపులర్ హాలీవుడ్ యాక్టర్, ‘హ్యారీ పోటర్’ ఫేమ్ పాల్ గ్రాంట్ మరణించారు.. ఆయన వయసు 56 సంవత్సరాలు.. పాల్, గురువారం (మార్చి 16) నార్త్ లండన్‌లోని యాస్టర్ రోడ్ సెయింట్ కింగ్స్ క్రాస్ స్టేషన్ బయట ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని అక్కడ మీడియా వెల్లడించింది..

పాల్ గ్రాంట్ 80’s లో ‘విల్లో’, ‘లైబర్తన్’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు.. తర్వాత ‘హ్యారీ పోటర్’, ‘స్టార్ వార్స్’ లాంటి మూవీస్‌తో వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యారు.. స్పాండిలోపిఫిసిల్ డైస్పాల్షియా కాంజెనిటల్ అనే అరుదైన జెనిటిక్ డిజార్డర్ వల్ల మరుగుజ్జులా ఉండిపోయిన పాల్ గ్రాంట్‌కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus