‘లవ్ టుడే’ తో (Love Today) తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) … ఈ ఏడాది ‘డ్రాగన్’ (Return of the Dragon) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బజ్ లేకుండా వచ్చినా సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో అనుపమ, కయాదు లోహార్ హీరోయిన్లుగా నటించారు. వాస్తవానికి ఈ సినిమాలో కథ పెద్దగా ఏమీ ఉండదు. ‘ఇంటర్మీడియట్ వరకు టాపర్ అయిన ఒక స్టూడెంట్.. తనకు అమ్మాయిలు పడట్లేదు అని భావించి లోఫర్ గా మారిపోతాడు.
అలాంటి టైంలో ఒక అమ్మాయి ప్రేమించినా.. తర్వాత బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు అని భావించి వదిలేసి వెళ్ళిపోతుంది. దీంతో ఆ అమ్మాయిపై కోపంతో ఫేక్ డిగ్రీ కొని పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు. దీంతో వేరే హీరోయిన్ తో పెళ్లి కుదురుతుంది. సరిగ్గా పెళ్లి టైంకి హీరోకి ఓ సమస్య వచ్చి పడుతుంది. తర్వాత ఏమైంది అనేది మిగిలిన కథ. త్వరలో రాబోతున్న శ్రీవిష్ణు (Sree Vishnu) ‘సింగిల్’ (#Single) సినిమా కథ కూడా దాదాపు ఇదే లైన్ తో ఉండబోతుంది అని ఇన్సైడ్ టాక్.
కార్తీక్ రాజు (Caarthick Raju) డైరెక్ట్ చేసిన ‘సింగిల్’ సినిమాలో శ్రీవిష్ణు హీరో. ఇటీవల టీజర్ బయటకు వచ్చింది. దాని చుట్టూ కాంట్రోవర్సీ ఏర్పడిన సంగతి కూడా తెలిసిందే. ఇదిలా ఉంటే… ఈ సినిమా కథ కూడా చాలా వరకు ‘డ్రాగన్’ ను పోలి ఉంటుంది అనే టాక్ వినిపిస్తోంది. హీరో కెరీర్లో తన 2 లవ్ స్టోరీలు ఫెయిల్ అవ్వడంతో చివరికి.. తన లైఫ్ లోకి వచ్చిన వేరే హీరోయిన్ ను హీరో పెళ్లి చేసుకుంటాడు అని వినికిడి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మే 9 వరకు ఎదురు చూడాల్సి ఉంది.