Rajamouli: జక్కన్నపై ప్రముఖ నటుడి షాకింగ్ కామెంట్స్ వైరల్!

స్టూడెంట్ నంబర్1 సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు సినిమాసినిమాకు దర్శకునిగా జక్కన్న స్థాయి అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇతర దేశాల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంటున్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా జీ5, నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో అందుబాటులోకి రాగా ప్రముఖ హాలీవుడ్ నటులలో ఒకరైన పాటన్ ఓస్వాల్ట్ ఈ సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

ఆర్ఆర్ఆర్ అద్భుతమైన మూవీ అని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పనిసరిగా చూడాలని ఆయన చెప్పుకొచ్చారు. దగ్గర్లోని థియేటర్లలో ఈ సినిమా అందుబాటులో లేకపోతే ఓటీటీలో అందుబాటులో ఉందని ఆయన అన్నారు. రాజమౌళి ఆలోచన, సినిమాను తెరకెక్కించిన తీరు అత్యద్భుతమని ఆయన కామెంట్లు చేశారు. రాజమౌళిని సినిమాలు తీయవద్దని రాజమౌళి సినిమాలు తీస్తే మిగతా దర్శకులు ఏమైపోతారో అంటూ ఆయన కామెంట్లు చేశారు. రాజమౌళి తర్వాత సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు.

ప్రముఖ నటుల నుంచి ఈ సినిమాకు ప్రశంసలు దక్కడంతో చరణ్, తారక్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. జీ5 ఓటీటీలో ఈ సినిమాకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వస్తోందని సమాచారం అందుతోంది. ఓటీటీ సబ్ స్క్రిప్షన్ లేని ప్రేక్షకులు బుల్లితెరపై ఈ సినిమాను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతోంది.

అయితే ఆర్ఆర్ఆర్ ఫుల్ రన్ దాదాపుగా ముగిసినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల నిర్మాతతో పాటు దర్శకునికి భారీ మొత్తంలో లాభాలు దక్కాయని తెలుస్తోంది. భవిష్యత్తు సినిమాలతో కూడా జక్కన్న సంచలన విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus