Star Actor: పారిస్ తోలిసారి ప్రయాణంలో జరిగిన సంఘటన చెప్పినా నటుడు!

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పాయ్. తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. తెలుగులోనూ పలు చిత్రాల్లో ఆయన ప్రతినాయకుడిగా నటించి మెప్పించారు. ఇక ‘ఫ్యామిలీమ్యాన్’ వెబ్ సిరిస్ ల్లో శ్రీకాంత్ తివారీగా ఆయన నటన హైలైట్. ఆ సిరీస్ సక్సెస్ కావడంలో మనోజ్ కూడా కీలక పాత్ర. అలాంటి నటుడు మద్యం ఫ్రీగా వస్తోందని తెలిసి, ఫుల్గా తాగేశాడట. మనోజ్ కెరీర్ తొలినాళ్లలో ఓ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్లో భాగంగా తొలిసారి పారిస్ వెళ్లారు. అప్పుడు జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని మనోజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

“అప్పుడు నేను థియేటర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నా. ఓ కార్యక్రమం కోసం పారిస్ వెళ్లాల్సి వచ్చింది. అదే నా తొలి అంతర్జాతీయ పర్యటన. విమానంలో మందు సర్వ్ చేశారు. అయితే, వెళ్లేటప్పుడు మద్యం ముట్టుకోలేదు. తాగితే డబ్బు కట్టమంటారేమోనని అనుకున్నా. ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు. పైగా నేను థియేటర్ ఆర్టిస్ట్గా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కింద పారిస్ వెళ్తున్నా. అక్కడకు వెళ్లాక తెలిసిందేంటంటే వాళ్లు ఫ్రీగానే మద్యం ఇస్తారని అర్థమైంది. వచ్చేటప్పుడు నాకు కావాల్సినంత మందు తాగేశా.

ఎంతంటే చాలా సేపటి వరకూ నాకు స్పృహ కూడా లేదు” అని మనోజ్ అప్పటి సంగతులను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. పారిస్ పర్యటన వల్ల తాను చాలా విషయాలను నేర్చుకున్నానని మనోజ్ అన్నారు. చాప్ స్టిక్స్ తినడం అప్పుడే తెలిసిందన్నారు. తొలిసారి వాటిని పట్టుకోవడం కుదరలేదని తెలిపారు. వాటితో తినడానికి ప్రయత్నిస్తుంటే భోజనం కింద పడిపోయేదని చెప్పుకొచ్చారు. అప్పుడు ఒక మహిళ తన దగ్గరకు వచ్చి ఒక ఫోర్క్ ఇచ్చి ‘మీరు దీనితో ప్రయత్నించండి.

చాప్లిక్స్లో తినడానికి కాస్త సాధన అవసరం’ అని సూచించిందట. అప్పటి నుంచి గత కొన్నిరోజుల వరకూ వాటిని ఉపయోగించాలంటే తాను చాలా భయపడిపోయేవాడినని మనోజ్ బాజ్ పాయ్ అన్నారు. కొన్ని రోజుల కిందట చాప్ స్టిక్స్లో ఎలా తినాలో తన కూతురు ద్వారా తెలుసుకుని. ఇప్పుడు ఎలాగో మేనేజ్ చేస్తూ తింటున్నానని వివరించారు. మనోజ్ ప్రస్తుతం ‘డిస్పాచ్. ‘జోరామ్ చిత్రాల్లో నటిస్తున్నారు.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus