సినిమాలు చూడటం లేదు… ఇండస్ట్రీపై సీనియర్‌ యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

బాలీవుడ్‌లోనే ఉంటూ.. అక్కడే వందల సినిమాలు… అందులోనూ అదిరిపోయే పాత్రలు చేసిన ఓ సీనియర్‌ నటుడు ఇప్పుడు అదే ఇండస్ట్రీ మీద షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. కొంతకాలంగా హిందీ సినిమాలు చూడడం మానేశాను అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. అంతేకాదు ఇలానే ఉంటే జనాలు కూడా చూడటం మానేస్తారు అని అన్నారు. అంతేకాదు దీనికి కారణం కూడా వివరించి చెప్పారు. దీంతో ఆ కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

హిందీ చలన చిత్ర పరిశ్రమపై నసీరుద్దీన్‌ షానే ఈ కామెంట్స్‌ చేసింది. డబ్బు సంపాదన లక్ష్యంగా పనిచేయడం ఆపేస్తేనే బాలీవుడ్‌పై ఆశలు ఉంటాయని చెప్పారాయన. దిల్లీలో ఇటీవల జరిగిన ‘మీర్‌ కీ దిల్లీ, షాజహానాబాద్‌: ది ఎవాల్వింగ్‌ సిటీ’ అనే కార్యక్రమంలో నసీరుద్దీన్‌ మాట్లాడారు. హిందీ సినిమాకి 100 ఏళ్ల ఘన చరిత్ర ఉందని గర్వంగా ఫీలవుతాం. కానీ, అప్పటి నుండీ ఒకే రకమైన సినిమాలు తెరకెక్కుతున్నాయి అని కామెంట్ చేశారాయన.

అంతేకాదు ఆ ధోరణే తనను నిరుత్సాహానికి గురి చేసిందన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు హిందీ చిత్రాలు చూసేందుకు థియేటర్లకు ఆసక్తిగా వెళ్తుంటారని… పరిస్థితులు మారకపోతే వాళ్లు కూడా చూడరు అనేలా ఆయన మాట్లాడారు. ఇలాంటి సినిమాలు వరుసగా చూసి వారు విసిగిపోతారనేది ఆయన మాట. డబ్బుల కోసమే సినిమాలు తీయడం లాంటి పనులు ఆపేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాస్తవాన్ని చూపించడం దర్శకుల బాధ్యత అని ఆయన గుర్తు చేశారు.

నిజానికి నసీరుద్దీన్‌ (Naseeruddin Shah)  గతంలో సినిమాల గురించి ఇలానే మాట్లాడారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’ సినిమాలను ఉద్దేశించి ‘‘ఈ మధ్య కాలంలో హీరోయిజాన్ని ఎలివేట్‌ చేసే సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. మార్వెల్‌ యూనివర్స్‌ సినిమాలు కూడా ఇలాంటివే. అదే పరిస్థితి భారత్‌లోనూ కనిపిస్తోందన్నారు ఆయన. అలాగే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రాలను ఇప్పటివరకూ నేను చూడలేదు అని చెప్పారు. అలాగే మణిరత్నం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చూశానని, ఎలాంటి అజెండాలు లేకుండా సినిమాలు చేస్తారు అని అన్నారు.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus