బిగ్ బాస్ షోకి మంచి క్రేజ్ ఉంది. ఈ షో ద్వారా పాపులర్ అయిన కంటెస్టెంట్లు చాలా మందే ఉన్నారు. వరుస సినిమాల్లో అవకాశాలు కూడా పొందుతున్నారు. అంతంత మాత్రం ఆదాయం ఉన్నవారు కూడా బిగ్ బాస్ లో పాల్గొని.. సొంతిల్లు కట్టుకునే స్థాయికి చేరుకుంటున్నారు. బిగ్ బాస్ షోకి వెళ్లడం కోసం సోషల్ మీడియాలో పాపులర్ అవ్వాలని పరితపించే జనాలు చాలామందే ఉన్నారు. అయితే ఓ నటుడు మాత్రం ‘బిగ్ బాస్’ కి పొరపాటున కూడా వెళ్ళను అంటూ ఆసక్తికర కామెంట్లు చేశాడు.
అతను ‘బిగ్ బాస్’ అంటే భయపడడానికి కారణం అతని భార్య అని చెప్పి ఇంకా షాకిచ్చాడు అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే… సీనియర్ స్టార్ దర్శకుడు విజయ్ భాస్కర్ అల్లుడు రవి శివ తేజ అందరికీ సుపరిచితమే. దాదాపు 400 కి పైగా షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. పలు సినిమాల్లో కూడా నటించాడు. అతను (Star Actor) నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’ ఇటీవల రిలీజ్ అయ్యింది.
ఆ సినిమా పెద్దగా ఆడలేదు. పెద్ద సినిమాల నడుమ రిలీజ్ అవ్వడంతో.. ఆడలేదు అని రవి శివ తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అలాగే తనకు పెళ్లవ్వడానికి కారణం.. తన భార్య శ్యామల అంటూ ఇతను తెలిపాడు. తన ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరీ తనని పెళ్లి చేసుకున్నట్టు అతను తెలియజేశాడు. కాకపోతే ‘ ‘బిగ్ బాస్’ కి కనుక వెళ్తే విడాకులు ఇచ్చేస్తాను’ అంటూ బెదిరించినట్టు కూడా అతను చెప్పి పెద్ద షాకిచ్చాడు.
2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?
‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!
‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్